దున్నపోతుల్లా తిని… ఉరిశిక్ష వేయాలి: కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం

మంగళవారం కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ సందర్బంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్స్ వార్ పీక్స్ కు చేరుకుంది. బీఆర్ఎస్ నేతల విమర్శలపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. వీళ్ళకు సిగ్గు శరం లేదు అంటూ మండిపడ్డారు.

  • Written By:
  • Publish Date - November 18, 2024 / 12:00 PM IST

మంగళవారం కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ సందర్బంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్స్ వార్ పీక్స్ కు చేరుకుంది. బీఆర్ఎస్ నేతల విమర్శలపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. వీళ్ళకు సిగ్గు శరం లేదు అంటూ మండిపడ్డారు. ఒకొక్కడు వెయ్యి కోట్లు మొక్కి దున్నపోతుల్లాగా మారారని తీవ్ర ఆరోపణలు చేసారు. మహిళలను రెచ్చ గొడుతున్నారన్నారు. మీరు కళలుకంటే మేం నిధులు తీసుకొచ్చి అమలు చేస్తున్నామని తెలిపారు.

ఈ ఎదవలకు సిగ్గు లేదు అని ఘాటు వ్యాఖ్యలు చేసారు. వీళ్ళను చీపుర్లు.. చెప్పులు మలేసి కొట్టేదాక వీళ్ళు మారరన్నారు. కాళోజీ కళాక్షేత్రం పూర్తిచేసి ప్రారంభోత్సవం చేస్తుంటే సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారన్నారు. దమ్ముంటే చర్చకు రావాలి అని సవాల్ చేసారు. గత ముఖ్యమంత్రి మొఖం కూడా మీకు చూపలేదన్నారు. తలుపులు పెట్టుకొని ఏడ్చిన మొఖాలు మీవి అంటూ ఎద్దేవా చేసారు. ఒక్కొక్కడు దున్నపోతుల్లగా బలిశారు… రేపో మాపో జైలు కు పోవడానికి రెడీగా ఉన్నారన్నారు. మిమ్మల్ని నడిరోడ్డుపై ఉరిశిక్ష వేయాలని ఘాటు వ్యాఖ్యలు చేసారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచులు మోయడానికి.. చెప్రాస్ గిరి కి అలవాటు పడ్డాడని మండిపడ్డారు.