CONGRESS: పతీ స‌మేతంగా.. స‌గ‌ర్వంగా.. అసెంబ్లీలోకి పద్మావతి రెడ్డి..

2014లో తొలిసారి కోదాడ నుంచి గెలిచిన ఆమె 2018లో ఓటమి పాలయ్యారు. అనంతరం ప్రస్తుత ఎన్నికలలో రెండోసారి ఎన్నిక‌ల బ‌రిలో నిలిచి విజయం సాధించారు. పద్మావతి భర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ ఎన్నికల్లో హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి గెలిచారు.

  • Written By:
  • Publish Date - December 6, 2023 / 03:16 PM IST

CONGRESS: ప‌తీ స‌మేతంగా.. స‌గ‌ర్వంగా మొద‌టి సారి అసెంబ్లీలో అడుగు పెట్ట‌బోతున్నారు న‌ల‌మాడ ప‌ద్మావ‌తి రెడ్డి. కోదాడలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నలమాడ పద్మావతి రెడ్డి 58,172 ఓట్ల భారీ ఆధిక్యంతో తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ నేత బొల్లం మల్లయ్య యాదవ్‌పై గెలిచారు. 2014లో తొలిసారి కోదాడ నుంచి గెలిచిన ఆమె 2018లో ఓటమి పాలయ్యారు. అనంతరం ప్రస్తుత ఎన్నికలలో రెండోసారి ఎన్నిక‌ల బ‌రిలో నిలిచి విజయం సాధించారు. పద్మావతి భర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ ఎన్నికల్లో హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి గెలిచారు.

REVANTH REDDY: ఆమెకే మొదటి ఉద్యోగం! హామీ నిలబెట్టుకుంటున్న రేవంత్..

2018లో హుజూర్‌నగర్ నుంచి గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ తరువాత 2019లో ఎంపీగా పోటీ చేసి గెలవడంతో హుజూర్‌నగర్ స్థానం ఖాళీ అయింది. అప్పుడు హుజూర్‌నగర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలలో పద్మావతి పోటీ చేశారు. కానీ, ఆ ఉప ఎన్నికలో ఆమె ఓడిపోయారు. అయితే.. ఈసారి జ‌రిగిన ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఎన్నికల్లో ప‌ద్మావ‌తి రెడ్డి త‌న గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. విస్తృతంగా ప్ర‌చారం నిర్వ‌హించారు. ఇప్పుడు పద్మావతి, ఉత్తమ్ ఇద్దరూ గెలవడంతో అసెంబ్లీలో భార్యాభర్తలిద్దరూ సభ్యులుగా అడుగు పెట్ట‌నున్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా కనిపించనున్న దంపతులు వీళ్లిద్దరే.