Palvai Harish Babu: అన్నీ కలిసొచ్చాయి.. సిర్పూర్‌లో బీజేపీ గెలవడానికి అసలు కారణం ఇదే..

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన హరీష్ తక్కువ మార్జిన్‌లో ఓడిపోయారు. కానీ ఈసారి పార్టీ పెద్దల నుంచి మంచి సపోర్ట్‌ ఉండటం హరీష్‌కు ప్లస్‌ పాయింట్‌ అయ్యింది. హరీష్‌ కోసం ప్రచారం చేసేందుకు స్వయంగా మోదీ, అమిత్‌ షా సిర్పూర్‌కు వచ్చారు.

  • Written By:
  • Publish Date - December 4, 2023 / 06:53 PM IST

Palvai Harish Babu: తెలంగాణలో ఉన్న నియోజకవర్గాల్లో సిర్పూర్‌ ఎన్నిక అత్యంత ఉత్కంఠగా సాగింది. బీజేపీ నుంచి పాల్వాయి హరీష్‌ మరోసారి పోటీ చేయడం.. వరుసగా మూడు సార్లు గెలిచిన కోనేరు కోనప్ప కూడా పోటీలో ఉండటం.. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఇక్కడి నుంచే పోటీ చేయడంతో ఆసక్తి నెలకొంది. దీంతో ముందుగా ఇక్కడ గెలుపోటములను ఎవరూ డిసైడ్‌ చేయలేకపోయారు. దీనికితగ్గట్లే.. సిర్పూర్‌ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ కూడా ఉత్కంఠంగా కొనసాగింది.

CONGRESS: కాంగ్రెస్‌లో సస్పెన్స్‌.. సీఎం ప్రకటన ఇవాళ లేనట్టే..

తొలి రౌండ్‌లో 1124 ఓట్ల మెజార్టీ సాధించిన బీజేపీ అభ్యర్థి హరీశ్‌.. రెండో రౌండ్‌లో ఏకంగా 6,018 ఓట్లు సాధించి.. 4,378 ఓట్ల మెజార్టీ పొందారు. దీంతో అంతా ఆయనే గెలుస్తాడు అనుకున్నారు. కానీ 5వ రౌండ్‌ ముగిసే సరికి 6,221 ఓట్ల మెజార్టీతో హరీశ్‌ ఉండగా.. తర్వాత మెజార్టీ తగ్గుతూ వచ్చింది. ఆ తరువాత అనూహ్యంగా ఏడు రౌండ్లలో కోనప్ప మెజార్టీ సాధించిన సస్పెన్స్‌కు తెరలేపాడు. కానీ చివరికి 3,088 ఓట్ల తేడాతో హరీష్‌ విజయం సాధించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన హరీష్ తక్కువ మార్జిన్‌లో ఓడిపోయారు. కానీ ఈసారి పార్టీ పెద్దల నుంచి మంచి సపోర్ట్‌ ఉండటం హరీష్‌కు ప్లస్‌ పాయింట్‌ అయ్యింది. హరీష్‌ కోసం ప్రచారం చేసేందుకు స్వయంగా మోదీ, అమిత్‌ షా సిర్పూర్‌కు వచ్చారు. అంతే కాకుండా ఆరె మరాఠా ఓటర్ల సపోర్ట్‌ కూడా ఈసారి హరీష్‌కు దక్కింది.

బీఆర్ఎస్‌ మీద ఉన్న వ్యతిరేకత కూడా హరీష్‌కు కలిసివచ్చింది. ఇక బీజేపీ హిందుత్వ స్టాండ్‌ను అక్కడి ప్రజలు అడాప్ట్‌ చేసుకున్నారు. దీనికి తోడు బీఎస్పీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ కారణంగా భారీ స్థాయిలో ఓట్‌బ్యాంక్‌ చీలింది. ఇది బీజేపీకి ప్లస్‌ అయ్యింది. ఈ పరిణామాల నేపథ్యంలో 3 వేల ఓట్లతో హరీష్‌ విజయం సాధించారు. వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్‌ కొట్టిన కోనేరు కోనప్ప స్పీడ్‌కు బ్రేక్‌ వేశారు.