Patancheru MLA: మహిపాల్ రెడ్డే పటాన్‌చెరు కా పఠాన్‌! హ్యాట్రిక్ గ్యారెంటీనా..?

మహిపాల్ వ్యూహాలకు ప్రత్యర్థి పార్టీ దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్నాయ్. ఆయన రాజకీయ చతురతకు.. జనాల నుంచి వస్తున్న స్పందన తోడు కావడంతో.. వార్‌ వన్‌సైడ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. మహిపాల్ రెడ్డి.. ఎప్పుడూ జనాల మధ్యలోనే ఉంటారనే పేరు ఉంది.

  • Written By:
  • Publish Date - November 17, 2023 / 04:09 PM IST

Patancheru MLA: హైదరాబాద్‌ అనగానే వినిపించే అసెంబ్లీల్లో టాప్‌లో ఉంటుంది పటాన్‌చెరు. ఈ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే.. అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. సెంటిమెంట్‌ ఏ స్థాయిలో ఉంటుందో రాజకీయం అదే స్థాయిలో సెగలు పుట్టిస్తుంటుంది అందుకే ! సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న గూడెం మహిపాల్‌ రెడ్డికి.. బీఆర్ఎస్ మళ్లీ అవకాశం ఇచ్చింది. హ్యాట్రిక్ మీద కన్నేసిన మహిపాల్‌ రెడ్డి.. ప్రతీ అవకాశాన్ని ఆయుధంగా మార్చుకుంటున్నారు.

CONGRESS MANIFESTO: కాంగ్రెస్ అభయహస్తం! వరాలు మామూలుగా లేవుగా !!

మహిపాల్ వ్యూహాలకు ప్రత్యర్థి పార్టీ దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్నాయ్. ఆయన రాజకీయ చతురతకు.. జనాల నుంచి వస్తున్న స్పందన తోడు కావడంతో.. వార్‌ వన్‌సైడ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. మహిపాల్ రెడ్డి.. ఎప్పుడూ జనాల మధ్యలోనే ఉంటారనే పేరు ఉంది. సాయం అన్నా అని ఎవరు అర్థించినా.. ఎక్కడున్నా వచ్చి అక్కడ వాలిపోయే రకం మహిపాల్ రెడ్డి. ప్రతీ ఒక్కరి సమస్యలు తెలుసుకుంటూ భరోసా ఇస్తుంటారు. ఇదే ఇప్పుడు మహిపాల్‌ను హ్యాట్రిక్‌ హీరోను చేయడం ఖాయం అనే ప్రచారం జోరుగా సాగుతోంది. నియోజకవర్గ అభివృద్ధిలో తనకంటూ ప్రత్యేకంగా మార్క్ క్రియేట్ చేసుకున్నారు మహిపాల్‌ రెడ్డి. సీఎం కేసీఆర్‌ను ఒప్పించి.. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకురావడంలో సూపర్ సక్సెస్ అయ్యారు. దీంతో కారు జోరుకు ఇక్కడ బ్రేకుల్లేండా ఉన్నాయ్. బీఆర్ఎస్‌ పక్కాగా గెలిచే స్థానాల్లో పటాన్‌చెరు టాప్‌లో ఉంటుందని బీఆర్ఎస్‌ వర్గాలు చెప్తున్నాయ్. ఇక సర్వేలు కూడా.. మహిపాల్‌ రెడ్డికి అనుకూలంగానే ఉన్నాయ్.

ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రి పోల్ సర్వేల్లో.. 99శాతం సర్వేలు మహిపాల్‌దే విజయం అని చెప్తున్నాయ్. ప్రతిపక్ష పార్టీలు కేవలం రాజకీయాలకే పరిమితం కావడం.. టికెట్ కోసం యుద్ధాలకు దిగడం.. ఇవన్నీ జనాల్లో ఆలోచన రేకెత్తించేలా చేస్తున్నాయ్. ఇక అటు విపక్షాల్లో ఉన్న లుకలుకలు కూడా.. మహిపాల్‌ రెడ్డికి కలిసివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఓవరాల్‌గా పటాన్‌చెరు కా పఠాన్‌.. మహిపాల్ రెడ్డే అని నియోజకవర్గ జనాలకు ధీమాగా చెప్తున్నారు.