SABITHA INDRA REDDY: రికార్డుల ‘స‌బిత‌’.. మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక

పోటీ చేస్తే అపజయం ఎరుగని నేత‌గా సబితకు రికార్డు ఉంది. మొన్న‌టి ఎన్నిక‌ల్లో కూడా మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి.. మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నారు. ఆమె తన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత అందెల శ్రీరాములు యాదవ్‌పై 26,187 ఓట్ల తేడాతో గెలిచారు.

  • Written By:
  • Publish Date - December 6, 2023 / 08:01 PM IST

SABITHA INDRA REDDY: సబితా ఇంద్రారెడ్డి దేశస్థాయిలో రికార్డులు తిరగరాశారు. మన దేశంలోనే ఒక రాష్ట్రానికి హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా నేతగా రికార్డుకెక్కారు. కొత్త రాష్ట్రం తెలంగాణలో తొలి మహిళా మంత్రిగా నిలిచారు. సబితా ఇంద్రారెడ్డి అనుకోకుండా రాజకీయ రంగప్రవేశం చేశారు. పోటీ చేస్తే అపజయం ఎరుగని నేత‌గా సబితకు రికార్డు ఉంది. మొన్న‌టి ఎన్నిక‌ల్లో కూడా మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి.. మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నారు.

SRINIVAS GOUD: ఇదేం దొంగపని.. ఫర్నీచర్ ఎత్తుకుపోతూ దొరికిపోయిన శ్రీనివాస్ గౌడ్..

ఆమె తన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత అందెల శ్రీరాములు యాదవ్‌పై 26,187 ఓట్ల తేడాతో గెలిచారు. భ‌ర్త ఇంద్రారెడ్డి అకాల మ‌ర‌ణంతో.. 2000లో వచ్చిన ఉపఎన్నికలో కాంగ్రెస్ నుంచి సబితా ఇంద్రారెడ్డి పోటీ చేసి గెలుపొందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్‌లో చేరి జైత్రయాత్ర ప్రారంభించిన ఆమె వైఎస్ఆర్‌కు చివరి వరకు దత్తత చెల్లిగానే మెలిగారు. ఇప్పటికీ వైఎస్ఆర్‌ను అన్నగానే సంబోధిస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఆమె నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. చేవెళ్ల, మహేశ్వరం నియోజకవర్గాల నుంచి గెలిచిన ఆమె 2019లో బీఆర్ఎస్‌లో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా హోం మంత్రిగా స‌బిత‌కు ప్ర‌త్యేక‌ గుర్తింపు ఉంది. ఆమె గనుల శాఖ మంత్రిగానూ పనిచేశారు. 2019లో బీఆర్ఎస్‌లో చేరిన తరువాత కేసీఆర్ కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. 2004లోనూ చేవెళ్ల నుంచి సబితా ఇంద్రారెడ్డి గెలిచి వైఎస్ఆర్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనతో చేవెళ్ల.. ఎస్సీలకు రిజర్వ్ చేయడంతో మహేశ్వరం స్థానం నుంచి 2009లో పోటీ చేసి గెలిచారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. భర్త ఇంద్రారెడ్డి తరహాలోనే ఆమె కూడా హోం మంత్రి పదవికే వన్నెతెచ్చారని చెబుతారు. 2014లో తనయుడు కార్తిక్ రెడ్డి కోసం పోటీకి దూరంగా ఉన్నా.. 2018లో గెలిచి 2019లో టీఆర్ఎస్‌లో చేరారు. విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు మళ్లీ మహేశ్వరం నుంచి బ‌రిలో నిలిచి గెలిచి.. త‌నకు ఎదురు లేద‌ని మ‌రోసారి నిరూపించారు.