ఏదేమైనా మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ బయటకు రావాలి అనుకోవడం మాత్రం మెగా ఫ్యామిలీలో ఎవరికి నచ్చలేదు. దాదాపు ఏడేళ్ళ నుంచి మెగా ఫ్యామిలీకి దూరంగా ఉండేందుకే అల్లు అర్జున్ ప్రాధాన్యతిస్తూ వచ్చాడు. పుష్ప ప్రాజెక్ట్ ఎప్పుడైతే మొదలైందో అక్కడి నుంచి అల్లు అర్జున్ లో ఆటిట్యూడ్ మారింది అనే ఒపీనియన్ చాలామందిలో వినపడింది. ఇక గతంలో కూడా ఏదైనా ఈవెంట్ జరిగితే మెగా ఫ్యామిలీకి సంబంధించి ఎవరి పేరు అయినా వినపడితే అల్లు అర్జున్ ఎక్స్ప్రెషన్స్ కూడా మారిపోయేది.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పేరును అల్లు అర్జున్ ఈవెంట్స్ లో కొంతమంది అభిమానులు గట్టిగట్టిగా అరిచేవారు. ఇది నచ్చని అల్లు అర్జున్ ఒక ఈవెంట్లో మాట్లాడుతూ… పవన్ పవన్ అని అరిస్తే రాడు అంటూ అలాగే తాను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడను అంటూ ఓ రకంగా కౌంటర్ ఇచ్చాడు. ఇక అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ను చాలా టార్గెట్ చేస్తూ వచ్చారు. మెగా ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలియదు గానీ అల్లు అర్జున్ మాత్రం 2024 ఎన్నికల్లో నంద్యాల అభ్యర్థికి ప్రచారం చేశారు, ఎన్నికల ప్రచారం చివరి రోజు ఆయన ప్రచారంలో పాల్గొన్నారు.
ఒక పక్కన పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్న సరే అల్లు అర్జున్ మాత్రం అక్కడ ఏమాత్రం ప్రచారం చేయలేదు. దానికి తోడు వైసీపీకి సపోర్ట్ చేయడం కాంట్రవర్సీ అయింది. కట్ చేస్తే ఇప్పుడు అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటన విషయంలో కేసుల్లో ఇబ్బందులు పడుతున్నాడు. ఈ టైంలో అరెస్టు కూడా అయి… జైలుకు వెళ్లి వచ్చాడు. అయితే జైలుకు వెళ్లొచ్చిన తర్వాత సినిమా వాళ్ళందరూ అల్లు అర్జున్ ను ఆయన ఇంటికి వెళ్లే పరామర్శించారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు వెళ్లకపోవడంతో స్వయంగా అల్లు అర్జున్… చిరంజీవి ఇంటికి నాగబాబు ఇంటికి తన భార్యతో కలిసి వెళ్ళాడు.
అదే టైంలో పవన్ కళ్యాణ్ హైదరాబాదులోనే ఉన్నా సరే అల్లు అర్జున్ ను కలవలేదు. చిరంజీవి ఇంటికి రావడం గాని లేదంటే అల్లు అర్జున్ ను తన ఇంటి గాని పిలవలేదు. అయితే అల్లు అర్జున్ గతంలో మాట్లాడిన మాటలను పవన్ కళ్యాణ్ మనసులో పెట్టుకున్నాడని… అందుకే కలవడానికి ఇష్టపడలేదని టాక్. ఇక ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ను బయటపడేసే అవకాశం ఉన్నా సరే పెద్దగా జోక్యం చేసుకోవడం లేదని చెప్పాలి. అసలు మెగా ఫ్యామిలీ ఈ విషయంలో ఏం మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. నిజం మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంటే అల్లు అర్జున్ కచ్చితంగా బయటికి వచ్చి ఉండేవాడు. ఈ విషయం గురించి మనం ఎక్కువ మాట్లాడకపోయినా ఏ విధంగా బయటికి వచ్చేవాడు అనేది జనాలు అందరికీ క్లారిటీ ఉంది. తన ఆటిట్యూడ్ తో మెగా ఫ్యామిలీని దూరం చేసుకున్న అల్లు అర్జున్ కు పవన్ కళ్యాణ్ తన ఇగో తో షాక్ ఇచ్చారు.