లైవ్ లో టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ ఫైర్

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్... కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుపై ఫైర్ అయ్యారు. నిన్న కాకినాడ పోర్ట్ లో 38 వేల టన్నుల రేషన్ బియ్యంను అధికారులు పట్టుకోగా నేడు రైస్‌ శాంపిల్స్‌ను పరిశీలించారు పవన్.

  • Written By:
  • Publish Date - November 29, 2024 / 01:47 PM IST

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్… కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుపై ఫైర్ అయ్యారు. నిన్న కాకినాడ పోర్ట్ లో 38 వేల టన్నుల రేషన్ బియ్యంను అధికారులు పట్టుకోగా నేడు రైస్‌ శాంపిల్స్‌ను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్‌… ఎమ్మెల్యే కొండబాబుకి చురకలంటించారు. పోర్టులోకి రైస్‌ ఎలా వస్తుందని ఎమ్మెల్యేపై ఫైర్‌ అయ్యారు. మీరు సరిగా ఉంటే రైస్‌ ఎలా వస్తుంది అని నిలదీశారు.

మీరు కూడా కాంప్రమైజ్‌ అయితే ఎలా అందుకేనా మనం పోరాటం చేసింది..? అంటూ ప్రశ్నించారు. కాగా గురువారం కాకినాడ యాంకరేజ్ పోర్ట్ లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంను కలెక్టర్ స్వయంగా పట్టుకున్నారు. 38,000 టన్నులు బియ్యం షిప్ లో లోడింగ్ అయినట్లు గుర్తించారు. షిప్ లో 640 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించినట్లు జిల్లా కలెక్టర్.. సగిలిషన్ మోహన్ బయటపెట్టారు. స్టెల డెల్ అనే షిప్పులో.. స్పాట్ లోనే కెమికల్స్ తీసుకెళ్లి రైస్ ని చెక్ చేశామని తెలిపారు.