Pawan Kalyan: మంత్రుల గొడవలో తలదూర్చి అభాసుపాలు.. వ్యూహం లేని రాజకీయం చేస్తున్న పవన్‌ !

ఆవిర్భావ వేడుకల తర్వాత ట్వీట్లకే పరిమితం అయిన పవన్.. చాలా గ్యాప్ తర్వాత ఓ వీడియో విడుదల చేశారు. తెలంగాణ మంత్రులపై ఏపీ మంత్రులు చేస్తున్న కామెంట్లను ఖండించారు. తెలంగాణ జనాలను ఏమైనా అంటే మాములుగా ఉండదు మరి అని వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడే జనాలకు కన్ఫ్యూజన్ మొదలైంది. తెలంగాణ రాష్ట్ర మంత్రులు.. ఏపీ మీద కామెంట్లు చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ మంత్రులకు కోపం వచ్చింది. హరీష్, కేటీఆర్‌కు.. గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

  • Written By:
  • Publish Date - April 18, 2023 / 07:30 PM IST

దీంతో మళ్లీ హరీష్ నుంచి రియాక్షన్ కనిపించింది. అసలు ఈ మాటల యుద్ధం ఏంటి.. వాళ్లు వీళ్లను ఎందుకు అన్నారు.. వీళ్లు వాళ్లను ఏమన్నారు.. ఈ మాటల యుద్ధం వెనక డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయా లేదా అన్న సంగతి గురించి పక్కనపెడితే.. సంబంధం లేని ఇష్యూలో పవన్ కల్యాణ్ తలదూర్చాడు. కందకు లేని దురద కత్తి పీటకు ఎందుకు అన్నట్లు.. తిట్టినోళ్లు, తిట్టించుకున్నోళ్లు బాగానే ఉన్నారు. సడెన్‌గా పవర్ ఎంట్రీ ఇచ్చి.. మాటలు పడ్డారు పవన్. నిజానికి రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు పవన్‌కు! ఐనా సరే వైసీపీ మంత్రులను టార్గెట్‌ చేస్తూ.. ఓ వీడియో వదిలారు. పిలిచి మరీ తిట్టించుకున్నట్లు.. ఏపీ మంత్రులతో మాటలు అనిపించుకున్నారు. ఏదో అనుకొని పవన్ అలాంటి కామెంట్స్ చేసి ఉండొచ్చు. కానీ ఇది కరెక్ట్ టైమ్ కాదు.. గట్టిగా చెప్పాలంటే కరెక్ట్ ఇష్యూ కూడా కాదు. వేరే గొడవలో వేలు పెట్టి తన్నించుకోవడం అంటే ఇదే అని ఇప్పుడు పవన్‌ను చూసి మాట్లాడుకుంటోంది రాజకీయం.

పార్టీ పెట్టి పదేళ్లు అయినా.. అంతకుమించిన రాజకీయ అనుభవం ఉన్నా.. పవన్‌కు ఇంకా సరైన అనుభవం రాలేదనే అభిప్రాయాలు.. ఈ ఇష్యూతో మళ్లీ ప్రూవ్ అయిందనే చర్చ జరుగుతోంది. పవన్‌ బొత్తిగా లౌక్యం తెలియని మనిషి. ఎన్నికల్లో గెలవాలి అనుకుంటారే తప్ప.. ఎలా గెలవాలో తెలియదు పాపం. సరైన వ్యూహాలు ఉండవ్. ఎప్పుడు ఏం మాట్లాడుతారో.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అర్థం కాదు. పవన్‌కు వ్యూహాలు ఉండవని.. వ్యూహాలు లేని రాజకీయాలు చేస్తారని.. మంత్రుల ఫైటింగ్ ఎపిసోడ్‌తో.. మళ్లీ ప్రూవ్ అయింది.

నిజానికి పవన్ రాజకీయం అంతా ఏపీలోనే ! తెలంగాణలో పార్టీ ఉంది అంటే ఉంది అంతే ! ఇక్కడ దృష్టి పెట్టడం కూడా తక్కువే ఆయన. అలాంటిది తెలంగాణ మంత్రులను పవన్‌ వెనకేసుకు రావడం చర్చకు దారి తీసింది. అలా అని ఒకరు చెప్తే పవన్ రియాక్ట్ అయ్యారా అంటే అదీ కాదు. పోనీ చిరులా సెన్సిటివా అంటే లేదు.. ఏది పడితే అది.. ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడుతుంటే.. ఇక రాజకీయాలు ఎలా చేస్తారని జనసైనికులే ప్రశ్నిస్తున్నారు. హరీష్‌ వర్సెస్ ఏపీ మంత్రుల యుద్ధం ఫైనల్‌ స్టేజీకి వచ్చింది అనుకున్న సమయంలో.. సినిమాల్లో స్పెషల్‌ రోల్ ఎంట్రీ ఇచ్చినట్లు ఇచ్చారు పవన్‌. ఇది సేనాని తప్పే అనే చర్చ జరుగుతోంది. వ్యూహం లేని రాజకీయానికి, నిలకడలేని స్వభావానికి ఇది ఎగ్జాంపుల్ అంటూ.. పవన్‌ మీద విమర్శలు గుప్పిస్తున్నారిప్పుడు చాలామంది. ఇంకొందరైతే.. గీత దాటి మరీ ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. వాళ్ల వీళ్ల పంచాయితీలో తలదూర్చడమేనా.. జనాల్లోకి వచ్చేది ఉందా లేదా అని డైరెక్ట్‌గానే ప్రశ్నిస్తున్నారు.