PAWAN KALYAN: ఆ రెండు సీట్లే ఎందుకు..? గెలుపు ఖాయమా..? పవన్ అందుకే ప్రకటించాడా..?

టీడీపీ పొత్తు ధర్మం మీరడంతో.. తాను కూడా రెండు సీట్లు ప్రకటిస్తున్నట్టు చెప్పాడు పవన్ కల్యాణ్. రాజోలు, రాజానగరం నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని తెలిపాడు. ఈ రెండు సీట్లను జనసేన ఎందుకు కోరుకుంటోంది..? అక్కడ పోటీ చేస్తే పక్కాగా గెలుస్తామని ధీమా ఉందా..?

  • Written By:
  • Updated On - January 26, 2024 / 07:53 PM IST

PAWAN KALYAN: రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే రెండు సీట్లను ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. టీడీపీ పొత్తు ధర్మం మీరడంతో.. తాను కూడా రెండు సీట్లు ప్రకటిస్తున్నట్టు చెప్పాడు. రాజోలు, రాజానగరం నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని తెలిపాడు. ఈ రెండు సీట్లను జనసేన ఎందుకు కోరుకుంటోంది..? అక్కడ పోటీ చేస్తే పక్కాగా గెలుస్తామని ధీమా ఉందా..?
2019సార్వత్రిక ఎన్నికల్లో, ఏపీలో జనసేన గెలిచిన ఏకైక సీటు రాజోలు. 2009లో కాంగ్రెస్ తరపున రాజోలు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక వరప్రసాద్ 2019లో జనసేన నుంచి గెలిచారు. కానీ 2014లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన రాపాకకి 350 ఓట్లే వచ్చాయి. అందుకే 2019లో జనసేన నుంచి పోటీ చేయడం వల్ల ట్రయాంగిల్ ఫైట్‌లో 850 ఓట్ల తేడాతో గెలిచారు. ఇది ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం. కానీ గెలిచిన తర్వాత రాపాక వైసీపీలోకి జంప్ అయ్యారు. ఇప్పుడు రాజోలు స్థానానికి మాజీ ఐఏఎస్ వరప్రసాద్, గతంలో వైసీపీ నుంచి పోటీ చేసి జనసేనలో చేరిన బొంతు రాజేశ్వరరావు, రాపాక రమేష్ టికెట్ ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో ఎస్సీల తర్వాత కాపుల ఓట్లు గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. ఇక్కడ క్షత్రియ కులం డామినేషన్ కూడా ఎక్కువే. ఏ పార్టీలో సీటు రావాలన్నా వారి సపోర్ట్ ఉండాలి. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వెళ్ళిపోయాక.. ఇక్కడ కోఆర్డినేటర్‌గా ఎవర్నీ ప్రకటించలేదు. అయితే జనసేనకి క్యాడర్ మాత్రం గట్టిగానే ఉంది. గ్రామస్థాయిలోనూ స్ట్రాంగ్‌గా ఉంది. దీనికితోడు కాపు సామాజిక వర్గం ఓట్లు గంపగుత్తుగా జనసేనకు పడే అవకాశముంది.

REVANTH REDDY Vs KTR: కేసీఆర్, కేటీఆర్ ఇక కాస్కోండి..! రేవంత్ ఎటాక్ మొదలుపెట్టాడు..

మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే ఎస్సీ ఓట్ పర్సంటేజ్ కూడా టీడీపీ-జనసేన కూటమికే ఎక్కువగా పడతాయి. ఇప్పటికే రాజోలు టీడీపీ కోఆర్డినేటర్‌గా ఉన్న మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును అమలాపురం ఎంపీగా పోటీ చేయించే ప్రయత్నం జరుగుతోంది. అప్పుడు రాజోలులో జనసేన అభ్యర్థే పోటీలో ఉంటారు. ఏపీలో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రాజానగరం నియోజకవర్గం 2009లో ఏర్పడింది. ఇక్కడ జనసేన కోఆర్డినేటర్‌గా బత్తుల బలరామకృష్ణ ఉన్నారు. ఆర్థికంగా బాగా సెటిల్ అయిన వ్యక్తి. గతంలో వైసీపీలో MPTC, ఎంపీపీగా అవకాశం ఇవ్వలేదని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో ఉన్న విభేదాలతో ఆ పార్టీ నుంచి బయటికి వచ్చేసారు. జనసేనలో చేరారు. దాంతో అప్పటిదాకా కోఆర్డినేటర్‌గా ఉన్న మేడా గురుదత్ ప్రసాద్‌ను పక్కన పెట్టిన జనసేన.. బత్తుల బలరామకృష్ణకు అవకాశం కల్పించింది. రాజానగరం నియోజకవర్గంలో కూడా కాపు ఓట్లు ఎక్కువ. గత ఎన్నికల్లో జనసేన 20 వేల ఓట్లు సాధించింది. ఇక్కడ టీడీపీ సంగతి చూస్తే.. ఆ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్‌ని గతంలోనే పక్కనపెట్టింది అధిష్టానం. పెద్దాపురానికి చెందిన బొడ్డు భాస్కర రామారావు కొడుకు వెంకట రమణ చౌదరిని కోఆర్డినేటర్‌గా నియమించింది. ఈయన 2014లో రాజమండ్రి ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

Chandrababu VS Pawan Kalyan : బాబు పొత్తుధర్మం పాటించట్లేదు.. టీడీపీకి పవన్ స్ట్రాంగ్ వార్నింగ్

రాజానగరం నియోజకవర్గంలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. టీడీపీ ముందు నుంచి ఇక్కడ కమ్మ వర్గానికి చెందిన వారికే అవకాశం ఇస్తోంది. రాజానగరం నియోజకవర్గం పునర్విభజనకు ముందు బూరుగుపూడిగా ఉండేది. గత ఎన్నికలకీ, ఇప్పటికీ పరిస్థితి మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జక్కంపూడి రాజాపై ఉన్న వ్యతిరేకత, టీడీపీకి సరైన అభ్యర్థి లేకపోవడంతో ఇక్కడ జనసేన పుంజుకుంది. టిడిపి-జనసేన పోల్ మేనేజ్మెంట్ గ్రౌండ్ లెవెల్‌లో కరెక్ట్ గా చేసుకుంటే ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకి గట్టి పోటీ ఇవ్వొచ్చు. పొత్తులో భాగంగా ఈ సీటు వదులుకోవడానికి టీడీపీ కూడా సిద్ధంగానే ఉంది. ఆ పార్టీ తరపున పెద్దగా యాక్టివిటీస్ కూడా ఏమీలేవు. వైసీపీ కూడా జనసేన టార్గెట్‌గానే నియోజకవర్గంలో రాజకీయాలు చేస్తోంది. కాకపోతే రాజానగరంలో టీడీపీ శ్రేణులు మాత్రం జనసేనకు ఆశించిన స్థాయిలో సపోర్ట్ చేయట్లేదు.