PAWAN KALYAN: టీడీపీ, జనసేన కూటమిదే అధికారం.. పార్టీ కోసం రూ.10 కోట్లు విరాళం: పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తన పార్టీ కోసం రూ.10 కోట్ల విరాళం ప్రకటించారు. పార్టీని బలోపేతం చేసేందుకు, ఎన్నికల ఖర్చుల నిర్వహణ కోసం తన సంపాదన నుంచి జనసేనకు రూ.10 కోట్లు విరాళంగా అందించనున్నట్లు పవన్ ప్రకటించారు.

  • Written By:
  • Publish Date - February 19, 2024 / 08:16 PM IST

PAWAN KALYAN: రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారన్నారు. విశాఖపట్నం, అనకాపల్లి నియోజకవర్గాలకు చెందిన జనసేన నేతలతో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. “ఏపీలో రాబోయే ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు. టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి రాబోతోంది.

KCR: ఈ వారం ఢిల్లీ టూర్‌కు కేసీఆర్‌.. బీజేపీతో పొత్తు ఖాయమేనా..?

2019 ఎన్నికల తర్వాత పార్టీ బలంగా నిలిచేందుకు దోహదపడ్డ నాయకులకు అండగా ఉంటాం. పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత నాది. జనసేన కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పిస్తాం. స్థానిక ఎన్నికల్లో, పీఏసీఎస్ లలో, ఇతర కీలక నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానాలు మనకు దక్కుతాయి. ఇప్పటి ఎన్నికల్లో స్థానాలు మాత్రమే కాకుండా.. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చే అవకాశాలనూ దృష్టిలో ఉంచుకోవాలి. వ్యక్తిగతంగా నా గెలుపు గురించి ఆలోచించడం లేదు. సమిష్టిగా గెలుపు కోసమే నా అడుగులు ఉంటాయి. పార్టీ బలోపేతం కోసం పార్టీ పక్షాన ఎన్నికల నిర్వహణ కోసం నా వంతుగా రూ.10 కోట్లు విరాళంగా అందిస్తా. ఏపీకి సుస్థిర పాలన అవసరం. అప్పుడే అభివృద్ధి సాధ్యం. అలాంటి సుస్థిర పాలన మన కూటమి అందిస్తుంది.

ఈ విషయాన్ని ఆర్థిక వేత్తలు, పారిశ్రామిక వేత్తలు కూడా అంటున్నారు” అని పవన్ వ్యాఖ్యానించారు. ఈ పర్యటన సందర్భంగా పవన్ తన సంపాదనలోంచి పది కోట్ల విరాళం ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. పవన్ ఒకవైపు విశాఖలో పర్యటిస్తున్నప్పటికీ ఆయన పోటీ చేసే స్థానం విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారా.. లేక భీమిలి నుంచి పోటీ చేస్తారా అనే ఆసక్తి నెలకొంది.