PAWAN KALYAN: లోకేష్ పాదయాత్ర యువగళం ముగింపు సభకు హాజరు కావడానికి పవన్ కళ్యాణ్ అంగీకరించడంపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు ఇంతకుముందు టిడిపి ఆహ్వానించినప్పుడు సున్నితంగానే తిరస్కరించారు పవన్ కళ్యాణ్. ఆరోజు తనకు ఒక ముఖ్యమైన పని ఉందని ప్రీ షెడ్యూల్డ్ ప్రోగ్రామ్ ఉంది కనుక తాను యువగళం ముగింపు సభకు హాజరు కాలేనని చెప్పారు.
PAWAN KALYAN: యువగళం పాదయాత్ర ముగింపు సభకు పవన్
అది పూర్తిగా టిడిపి పార్టీ ప్రోగ్రామ్ కనుక తానా ప్రోగ్రాంలోకి వెళ్లి హడావుడి చేయడం అనవసరమని పవన్ కళ్యాణ్ మొదట భావించారు. కానీ ఎన్నికలకు ముందు యువగళం ముగింపు సభ ఒక ల్యాండ్ మార్క్ మీటింగ్ కావాలని, అక్కడి నుంచే ఎన్నికలకు పూర్తిస్థాయిగా వెళ్లాలని టిడిపి భావిస్తుంది. అంతేకాదు లోకేష్‌కి ఒక బ్రాండ్ ఇమేజ్ ఈ ముగింపు సభ ద్వారానే వస్తుందని కూడా తెలుగుదేశం ఆశ. ఈ సభకు పవన్ కళ్యాణ్ వస్తే జనం నిండుగా వస్తారని.. అంతేకాక రెండు పార్టీలు సమన్వయంతో నిర్వహించే తొలి సభ ఇదే అవుతుంది అని కూడా టిడిపి ఆశిస్తుంది. ఏది ఎలా ఉన్నా ఫైనల్‌గా లోకేష్‌కు ఒక ఇమేజ్ సాధించి పెట్టడానికే ఈ సభ అనేది అందరికీ తెలిసిందే. అందుకే తొలుత పవన్ కళ్యాణ్ ఈ సభకు దూరంగా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు స్వయంగా పవన్ ఇంటికి వెళ్లి ఆయన్ని గడ్డం, కాళ్లు పట్టుకొని బ్రతిమిలాడారు. సీట్ షేరింగ్ కోసం, పార్టీల మధ్య సమన్వయం కోసం బాబు పవన్ కలిశారని మీడియాలో ప్రచారం జరిగింది. కా
T CONGRESS: తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ భేటీ.. పార్లమెంట్ ఎన్నికలపై చర్చ
నీ అదంతా ఉత్తిదే. కేవలం పవన్ కళ్యాణ్‌ని సభకు రప్పించడానికి ఒప్పించేందుకు బాబు పదేళ్ల తర్వాత పవన్ గుమ్మం ఎక్కారు. రెండున్నర గంటల పాటు రకరకాలుగా చంద్రబాబు పవన్‌పై ఒత్తిడి తెచ్చి చివరికి ఆయన్ని ఒప్పించారు. లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు పవన్ కళ్యాణ్ హాజరవుతాడని సమాచారం బయటకు రాగానే జనసేనలోనే భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఊర్లో వాళ్ళ పెళ్లికి కుక్కలు హడావుడి అన్నట్లు ఆ పార్టీ సభకి జనసేన హడావుడి ఏంటి అని కొందరు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. కేవలం క్రౌడ్ పుల్లింగ్ కోసం మాత్రమే చంద్రబాబు పవన్ కళ్యాణ్‌ని పిలుస్తున్నారని, టీడీపీ సభతో జనసేనకి ఏమి సంబంధం అని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. టిడిపితో ఎంత పొత్తులు ఉన్నప్పటికీ, భాగస్వామ్య పార్టీ అయినప్పటికీ వాళ్ల సభలో జనసేన జెండాలు ఎగరేయడం కోసం చేస్తున్న పోరాటంలా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
లోకేష్ ఇమేజ్ పెంచడానికి పవన్ కళ్యాణ్‌ను ఇలా వాడుకోవడం సబబా అని ప్రశ్నించేవారు లేకపోలేదు. లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు పవన్ కళ్యాణ్ వెళ్లడం ఒక రకంగా జనసేన ఐడెంటిటీని దెబ్బ కొట్టడమేనని, ఫైనల్‌గా ఈ వ్యవహారంలో టిడిపి మాత్రమే లాభపడుతుందని జనసేనలో కొందరు ఓపెన్‌గానే కామెంట్ చేస్తున్నారు.