PAWAN KALYAN: ఏపీ సీఎం ఎవరు అనేది తాను, చంద్రబాబు నాయుడు కలిసి చర్చించుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అన్నీ ప్రజలకు చెప్పే చేస్తామన్నారు. విశాఖపట్నం ఏఎస్ రాజా గ్రౌండ్‌లో గురువారం సాయంత్రం జరిగిన జనసేన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. “సీఎం ఎవరు అనేది చంద్రబాబు, నేను కూర్చుని నిర్ణయం తీసుకుంటాం. అన్నీ ప్రజలకు చెప్పే చేస్తాం. మీ ఆత్మ గౌరవం ఎప్పుడూ తగ్గించను.
REVANTH REDDY: రేవంత్‌కు చిరు, పవన్ విషెస్.. వెల్లువెత్తిన శుభాకాంక్షలు..
ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి అలయన్స్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. మేము ఎవరికీ బీ పార్టీ కాదు. నన్ను నేను తగ్గించునకైనానా మిమ్మల్ని పెంచడానికి నేను సిద్ధం. ఆడపిల్లల మీద అన్యాయం జరిగితే కాళ్ళు, చేతులు తీసేసే బలం మనకు కలగాలి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక మహిళల మీద దాడుల్లో రాష్ట్రం 6వ స్థానంలో ఉంది. మమ్మల్ని గెలిపిస్తే పోలీస్ శాఖకు పూర్వ వైభవం తెస్తాం. శాంతిభద్రతల విషయంలో రాజీపడని అధికారులను నియమిస్తాం. నేను అహంకారంతో ఆలోచించే వాడిని కాదు. 2024లో ఏపీ భవిష్యత్తు బంగారు మయం చేయాలి అనేది నా లక్ష్యం. జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థులను బలమైన ఓట్లతో గెలిపించగలిగితే మన కోరిక తీరుతుంది. ఒక్క జనసేన ఎంపీ ఉన్నా స్టీల్ ప్లాంట్ గనులు సాధించే వాడిని. విశాఖ స్టీల్‌ప్లాంట్ పోరాటం.. అన్ని జిల్లాలను ఏకం చేసిందని, విశాఖ ఉక్కు అంశం భావోద్వేగంతో కూడినది. నేను సక్సెస్ అయినప్పుడు ఎవరూ గుర్తు పెట్టుకోరు. కష్టం వచ్చినప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్, జనసేన గుర్తుకు వస్తాయి. నేను ఓడిపోయిన సమయంలో విశాఖ నన్ను గుండెలకు హత్తుకుంది.
నా సినిమా టిక్కెట్ల నియంత్రణ కోసం రెవెన్యూ యంత్రాంగాన్ని వాడుకునే చిల్లర చేష్టలు చేసింది జగనే. జగన్ కిరాయి గుండాలను ఎదుర్కొనే ధైర్యం వైజాగ్ ఇచ్చింది. జనసేన, టీడీపీలను గెలిపించండి. మరోసారి వైసీపీ వైపు చూస్తే నష్టమే. గంజాయి, డ్రగ్స్‌తో వేల కోట్లు ఈ పాలకులు వచ్చేశాయి. రాష్ట్రంలో అవినీతి.. ప్రజల భవిష్యత్తును నిర్ధేశించే ప్రమాదకర స్థాయికి వెళ్ళిపోయింది. 151 సీట్లతో వైసీపీని గెలిపించినా ఇప్పటి వరకూ ఒక్కటీ సరైనా ఉద్యోగం ఇవ్వలేదు. నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు. యువత కోసమే నా ఆలోచన” అని పవన్ వ్యాఖ్యానించారు.