PAWAN KALYAN: ఈసారి పవన్ సీటు ఎక్కడ..? ఇప్పుడు వెతుక్కోకపోతే అప్పుడు కష్టం !

ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ లీడర్లలో ఒకరైన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కి స్థిరంగా ఓ నియోజకవర్గం అంటూ ఏదీ లేదు. జగన్ ఎన్నిసార్లు పోటీ చేసినా.. పులివెందులలో గెలవడం గ్యారటీ. అలాగే చంద్రబాబుకి కుప్పం స్థిరమైన నియోజకవర్గంగా ఉంది. మరి పవన్ కల్యాణ్‌కి ఇలా ఓ నియోజకవర్గం ఎందుకు లేకుండా పోయింది.

  • Written By:
  • Publish Date - November 14, 2023 / 01:44 PM IST

PAWAN KALYAN: ఆంధ్రప్రదేశ్‌లో పాపులర్ లీడర్లు అందరికీ ఏదో ఒక నియోజకవర్గం ఉంది. అక్కడ నిలబడ్డారంటే జనం ఆలోచించకుండా వారికే ఓట్లేసి గెలిపిస్తారు. ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ నాయకుల గెలుపు మాత్రం ఖాయం. జగన్‌కి పులివెందుల, చంద్రబాబుకి కుప్పం లాగా.. కానీ ఓ నాయకుడికి మాత్రం పాపం.. ఎక్కడా స్థిరంగా ఓ నియోజకవర్గమే లేదు. అసలు ఆయన ఎందుకు ఈ ఇష్యూ మీద ఇప్పటిదాకా శ్రద్ధ పెట్టలేదు అంటే.. ఏమో..!

MLA Sitakka : సీతక్కను ఓడించేందుకు 200 కోట్లు !?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ లీడర్లలో ఒకరైన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కి స్థిరంగా ఓ నియోజకవర్గం అంటూ ఏదీ లేదు. జగన్ ఎన్నిసార్లు పోటీ చేసినా.. పులివెందులలో గెలవడం గ్యారటీ. అలాగే చంద్రబాబుకి కుప్పం స్థిరమైన నియోజకవర్గంగా ఉంది. మరి పవన్ కల్యాణ్‌కి ఇలా ఓ నియోజకవర్గం ఎందుకు లేకుండా పోయింది. 2009 నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. కానీ ఇప్పటికీ తనకంటూ సొంత నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయారు. ఇప్పుడు అదే పెద్ద సమస్య అయింది. ఎందుకంటే.. ఏ నాయకుడికైనా ఓ నియోజకవర్గం ఉంటే అక్కడ కేడర్‌ని డెవలప్ చేసుకుంటారు. ద్వితీయస్థాయి నాయకత్వంతో పాటు పోలింగ్ బూత్ లెవల్ దాకా లీడర్లను పెట్టుకుంటారు. నెలలో రెండు, మూడు సార్లు అక్కడి జనాన్ని కలవడం.. తనకంటూ ప్రత్యేకంగా ఓ క్యాంపాఫీస్ పెట్టుకోవడం లాంటివి చేస్తుంటారు.

ఇవన్నీ ఏర్పాటైతే.. ఆ నాయకుడు రాష్ట్రం అంతా తిరిగినా.. సొంత నియోజకవర్గంలో తన అనుచరగణం పకడ్బందీగా పనిచేస్తుంది. ఆ నాయకుడు గెలవడానికి నూటికి నూరుపాళ్ళు ఛాన్స్ ఉంటుంది. కానీ పవన్ కల్యాణ్‌కి ఏపీలో అలాంటి నియోజకవర్గమే ఇప్పటి దాకా లేదు. 2019లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కానీ అంతకుముందు నుంచీ బూత్ లెవల్ నుంచి నియోజవర్గ స్థాయి దాకా.. ఈ రెండు సీట్లలో ఏ ఒక్క చోట కేడర్‌‌ను డెవలప్ చేసుకున్నా పవన్ గెలుపు గ్యారంటీ ఉండేది. కానీ 2019లో గాజువాక, భీమవరం.. రెండు స్థానాల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం అనుచరగణం లేకపోవడమే. ఆ విషయం పవన్ ఇప్పటిదాకా గ్రహించుకోలేకపోయారు. పవన్ కల్యాణ్ రాష్ట్రమంతా తిరుగుతుంటే.. ఆయన పోటీ చేసే చోట పనిచేసే కేడర్ కనిపించడం లేదు.

మరి ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగైదు నెలలే ఉన్నాయి. ఇప్పటికైనా గాజువాకనా.. భీమవరమా.. లేదా మరేదైనా నియోజకవర్గమా.. ఎక్కడైనా సరే.. తనకంటూ ఓ సొంత నియోజకవర్గం ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ కింది స్థాయి నుంచి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాతే రాష్ట్రం మొత్తం తిరిగితే బెటర్. లేదంటే ఏపీలో పవన్ కల్యాణ్‌కు మరోసారి ఓటమి తప్పదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఎంతో టైమ్ లేదు. ఇప్పటికైనా పవన్ ఆలోచించి.. సొంత నియోజకవర్గం నిర్ణయించుకోవడం.. అక్కడ ఓ క్యాంపాఫీస్, సొంత కేడర్ ఏర్పాటు చేసుకోవడం లాంటి వాటిపై దృష్టి పెట్టాల్సి ఉంది.