PAWAN KALYAN: పవన్ కళ్యాణ్ పోటీ ఎక్కడి నుంచి అని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న జనసైనికులకు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మీటింగ్‌లో.. తాను పిఠాపురం నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో లోకల్ క్యాడర్‌లో జోష్.. వెయ్యిరెట్లు పెరిగింది. కానీ ఇదే సమయంలో పవన్ నిర్ణయం పిఠాపురంలో మంటలు రేపింది. పవన్ పోటీని వ్యతిరేకిస్తూ స్థానిక టీడీపీ నేత వర్మ అనుచరులు రోడ్డెక్కారు. టీడీపీ జెండాలు తగలబెట్టారు.
MUDRAGADA PADMANABHAM: పిఠాపురం నుంచి పవన్ పోటీ.. వైసీపీ ముద్రగడను దింపబోతోందా ?
పార్టీ వర్మను మోసం చేసిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్నేళ్లుగా పార్టీ కోసం పని చేయించుకుని.. ఇప్పుడు బయటి నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారంటూ డిమాండ్ చేశారు. వెంటనే ఈ నిర్ణయంపై పురాలోచించాలంటూ టీడీపీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. పిఠాపురం సీటు వర్మకు కేటాయించకపోతే.. ఇండిపెండెంట్‌గా ఆయన పోటీ చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఒక్కసారి పిఠాపురం రగిలిపోయింది. తమ పొత్తులో బీజేపీని ఏకం చేసేందుకు పవన్ చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నారు. దానికోసం తన పార్టీ సీట్లను కూడా వదులుకున్నారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు పవన్ పోటీ చేస్తానన్న స్థానంలోనే ఇలాంటి రియాక్షన్ టీడీపీని ఇరకాటంలో పని చేసింది. ఇప్పుడు చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది సస్పెన్స్‌గా మారింది. దాదాపు ఐదేళ్ల నుంచి పిఠాపురంలో వర్మ పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా రోజుల నుంచి వర్మకే టికెట్ అంటూ అంతా అనుకున్నారు. కానీ కొన్ని రోజుల నుంచి అక్కడ పవన్ కళ్యాణ్ పేరు వినిపించడంతో వర్మ వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రీసెంట్‌గా ఇరు వర్గాల మధ్య ఫ్లెక్సీ వార్ కూడా జరిగింది.
వ్యక్తి ఎవరన్నది కాదు అభివృద్ధి ముఖ్యం అని జనసేన నేతలు ఫ్లెక్సీలు పెడితే.. నాన్‌లోకల్‌కు సహకరించేది లేదని వర్మ వర్గీయులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇలాంటి హాట్ హాట్ సిచ్యువేషన్ ఉన్న తరుణంలో.. ఇప్పుడు పవన్ తన స్థానాన్ని అధికారికంగా ప్రకటించడం ఇరు వర్గాల మధ్య మంటలు లేపింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. ఇప్పుడు అన్ని సమీకరణాలు చూసుకుని పిఠాపురం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. కానీ.. చివరి నిమిషంలో ఈ అసమ్మతి అటు జనసేనలో కూడా టెన్షన్ పుట్టిస్తోంది. ఈ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్‌క షాక్ తప్పదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలకు సరిగ్గా రెండు నెలలు కూడా లేవు. వైసీపీ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతోంది. ఇలాంటి సిచ్యువేషన్‌లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఈ స్థాయి దుమారాన్ని లేపడం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో సంచలనంగా మారింది.