CBN – Pawan: 50సీట్లు ఇస్తేనే పొత్తు అంటున్న పవన్‌.. నిండా మునుగుతాం అంటున్న చంద్రబాబు

50సీట్లు కేటాయిస్తే.. మొదటికే మోసం వచ్చి అవకాశం ఉంటుందని.. జగన్‌కు మళ్లీ ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందని వివరించే ప్రయత్నాలు సాగుతున్నాయ్. మరి దీనికి పవన్ అంగీకరిస్తారా.. అర్థం చేసుకుంటారా..?

  • Written By:
  • Publish Date - March 17, 2023 / 07:00 PM IST

ప్రయోగాల్లేవ్‌.. బలిపశువు కావడాల్లేవ్ అంటూ మచిలీపట్నం వేదికగా మెసేజ్ ఇచ్చిన పవన్.. టీడీపీతో పొత్తు గురించి పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. 20సీట్లకు మాత్రమే అంగీరించానని జరుగుతున్న ప్రచారంపై కూడా రియాక్ట్ అయ్యారు. తాను అలా అంగీకరించలేదని.. నమ్మండయ్యా అంటూ చేతులెత్తి మరీ దండాలు పెట్టారు. ఏపీ రాజకీయాలను హీట్‌ పుట్టిస్తోంది ఇదే ఇప్పుడు ! జనసేనకు టీడీపీ ఎంత అవసరమో.. టీడీపీకి జనసేన అంతే అవసరం ! పొత్తులు కుదిరితేనే.. అన్నీ కలిసొచ్చి.. విజయం దారిలోకి వచ్చేది! ఏ చిన్న పొరపాటుకు ఆస్కారం లేకుండా.. అదే సమయంలో గౌరవప్రదంగా పొత్తులు ఉండేలా ప్లాన్ చేస్తున్నాయ్ రెండు పార్టీలు. దీంతో సైకిల్‌, గ్లాస్ పార్టీల మధ్య ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయ్. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు 15సీట్లు మాత్రమే ఇచ్చి.. ఆ తర్వాత ఎమ్మెల్సీల రూపంలో ఆ పార్టీకి పెద్దపీట వేయాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుంటే.. తక్కువలో తక్కువ 50 స్థానాలు డిమాండ్‌ చేయాలని పవన్ ఫిక్స్ అయ్యారు. 50 సీట్లు అడగడం వెనక పవన్‌కు భారీ వ్యూహం ఉంది. గత ఎన్నికల్లో జనసేనకు వచ్చిన ఓట్లతో కంపేర్ చేస్తే 50 నియోజకవర్గాల్లో వైసీపీకి వచ్చి మెజారిటీ చాలా తక్కువ. 2019లో జనసేన పార్టీకి 9శాతం ఓట్లు వచ్చాయ్. ఐతే ఇప్పుడు అది 12శాతానికి పెరిగిందని సర్వేలు చెప్తున్నాయ్. ఇప్పటికిప్పుడు ఒంటరిగా పోటీ చేసినా.. 20స్థానాల్లో విజయం సాధిస్తామని.. పొత్తు కుదిరితే 40స్థానాలు ఖాయం అన్నది జనసేన వర్గాల నమ్మకం. దీంతో పొత్తు కుదిరితే 50 స్థానాలు అడిగి తీరాలని పవన్ పట్టుదలతో ఉన్నారు. ఐతే చంద్రబాబు మాత్రం దీనికి సుముఖంగా కనిపించడం లేదు అనే చర్చ జరుగుతోంది. ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు కోస్తాంధ్రలో కొన్ని స్థానాల్లో మినహా.. జనసేనకు పెద్దగా బలం లేదని.. క్షేత్రస్థాయిలోనూ సరైన కేడర్ లేదని.. అలాంటి పార్టీకి 50సీట్లు కేటాయిస్తే.. వైసీపీ నెత్తిన పాలు పోసినట్లే అన్నది టీడీపీవర్గాల వాదన. ఇదే విషయం పవన్‌కు, జనసేనకు అర్థం అయ్యేలా చెప్పేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. 50సీట్లు కేటాయిస్తే.. మొదటికే మోసం వచ్చి అవకాశం ఉంటుందని.. జగన్‌కు మళ్లీ ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందని వివరించే ప్రయత్నాలు సాగుతున్నాయ్. మరి దీనికి పవన్ అంగీకరిస్తారా.. అర్థం చేసుకుంటారా.. అది కాదు అని వేరే మ్యాటర్ టీడీపీకి అర్థం అయ్యేలా చెప్తారా అన్నది ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.