JANASENA: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీని ఢీకొట్టడానికి టీడీపీ-జనసేన కూటమి సిద్ధమైంది. దానికి ఇప్పుడు బీజేపీ కూడా జత కలుస్తోంది. దాంతో ఏపీలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారనున్నాయి. ఈ కూటమిలో కచ్చితంగా లాభపడుతోంది జనసేన మాత్రమే అనిపిస్తోంది. అంటే జనసేనకు ఏపీలో బలం లేదా..? పవన్ కల్యాణ్‌కి ఇమేజ్ లేదా అని అడిగేవాళ్ళూ ఉన్నారు. కురువృద్ధుడు హరిరామ జోగయ్య లాంటి వాళ్ళయితే జనసేన 60 సీట్లు కోరాల్సిందే అని పట్టుబడుతున్నారు. చంద్రబాబు కూడా తన పార్టీ అభ్యర్థులను బుజ్జగించుకుంటూ.. బీజేపీ, జనసేనకు సీట్లు షేరింగ్ చేస్తున్నారు. అయితే అసలు పవన్ కల్యాణ్‌కి 60 సీట్లు ఇచ్చినా.. అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే నాయకులు ఉన్నారా..? అన్నది డౌట్‌గా మారింది. పవన్ చుట్టూ కనిపించే నాదెండ్ల మనోహర్ లాంటి పది మంది నేతలు, ఈమధ్యకాలంలో వైసీపీ నుంచి వచ్చిన లీడర్లు తప్ప జనసేనలో నాయకులే కనిపించడం లేదు.
PAWAN KALYAN: పొత్తులపై తొందరపాటు మాటలొద్దు.. జనసైనికులకు పవన్ సూచన
2014లో జనసేన పార్టీని స్థాపించారు పవన్ కల్యాణ్. అంటే ఇప్పటికి పదేళ్ళు. ఈ దశాబ్దం కాలంలో ఎప్పుడైనా పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయాలన్న ఆలోచన చేశారా..? పోలింగ్ బూత్, వార్డులు, గ్రామాలు, మండలం నుంచి జిల్లా స్థాయి దాకా పార్టీని నిర్మాణం చేశారా..? ఎన్నికల ముందు ఎవరో కొందరు నేతలు వచ్చి జనసేనలో చేరితే ఆ పార్టీ సంస్థాగతంగా పటిష్టంగా ఉన్నట్టు అనుకోవచ్చా..? కనీసం జగన్ అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్ళలో అయినా పవన్ కల్యాణ్ తన పార్టీని గ్రామస్థాయి నుంచి ఎందుకు బలోపేతం చేసుకోలేకపోయారు..? అదేమంటే పవన్ అంటే పడి చచ్చే అభిమానులు ఉన్నారు. అంతకంటే ముఖ్యంగా కాపుల ఓట్లు ఉన్నాయని ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటారు. ఏపీలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కాపుల జనాభా ఎక్కువగా ఉంది. అందుకే అక్కడ తమకు బలం ఎక్కువనీ.. ఆ సీట్లనే జనసేన కోరుకుంటోంది. 2019లో పవన్ ఎక్కడ మీటింగ్ పెట్టినా వేలు, లక్షల మంది తరలి వచ్చారు.
పవన్ మాట్లాడే ప్రతి పంచ్‌కీ.. ఈలలు, కేకలు వేసి గాయ్ గాయ్ చేసేవాళ్ళు. ఆ జనాన్ని చూసి ఈసారి పవన్ సీఎం అవడం ఖాయమని బయటి వాళ్ళు అనుకున్నారు. కానీ ఆయన పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లోనే గెలవలేకపోయాడు. కాపుల జనాభా 70 వేలకు పైగా ఉన్న నియోజకవర్గాల్లోనే పవన్ పోటీ చేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ మూడింట రెండు వంతుల ఓట్లు వాళ్ళవే. కానీ పవన్ గెలిచాడా..? కాపుల ఓట్లను మాత్రమే నమ్ముకుంటే జనసేన గెలుస్తుందా..? మిగతా కులాల వాళ్ళు ఓట్లు అక్కర్లేదా..? అసలు గ్రౌండ్ లెవల్లో పార్టీ నిర్మాణం లేకపోతే జనసేనకు ఓట్లు ఎలా వస్తాయి..? పవన్ కల్యాణ్ వస్తే.. సినిమా నటుడిని చూడటానికి వచ్చినట్టు జనం వస్తున్నారే తప్ప.. వాటిని ఓట్ల రూపంలో మలచాలంటే గ్రౌండ్ లెవల్లో నాయకులు కావాలి కదా. ఇదంతా ఒక ఎత్తయితే.. పవన్ కల్యాణ్ అసలు ఇప్పటికీ తనకంటూ ఒక నియోజకవర్గాన్ని బిల్డ్ చేసుకోలేకపోయాడు. దేశంలో గానీ.. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో గానీ.. పెద్ద నాయకులు ఎవరైనా సరే.. తమకంటూ ఓ నియోజకవర్గాన్ని డిసైడ్ చేసుకుంటారు. అక్కడ సంస్థాగతంగా అభివృద్ధి చేసుకుంటారు. నిత్యం జనంలో తిరుగుతారు. కానీ పవన్ 2019లో ఓడిపోయినా తర్వాత నుంచి ఇప్పటి దాకా ఏ ఒక్క నియోజకవర్గాన్ని ఓన్ చేసుకోలేకపోయారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తం మీద సంస్థాగత నిర్మాణం చేస్తాడని ఎలా అనుకోవచ్చు.
YS SHARMILA: జగన్ నా రక్తమే.. కానీ, కల్తీ మద్యంతో జనాల్ని చంపుతున్నారు: షర్మిల
నిజానికి చంద్రబాబు నాయుడికి కూడా జగన్‌ను ఎదురించాలంటే పొత్తులు చాలా అవసరం. పొత్తుల విషయంలో దేశంలోనే టీడీపీ రికార్డులు క్రియేట్ చేసింది. గతంలో ఇదే చంద్రబాబు అవినీతిని ఎండగట్టిన పవన్.. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. అంత కష్టంగా.. అంత భారంగా.. తప్పదన్నట్టుగా టీడీపీతో పవన్ పొత్తును ఎందుకు కోరుకోవాలి..? అదే జనసేనను గ్రౌండ్ లెవల్లో పటిష్టం చేసి ఉంటే.. పవన్‌కు ఉన్న ఇమేజ్, దాతృత్వం కూడా తోడైతే అప్పుడు ఎవరి అవసరం లేకుండా అధికారంలోకి రాకపోయినా.. కనీసం చెప్పుకోదగ్గ సీట్లు గెలుచుకోడానికి అయినా జనసేనకు అవకాశం ఉంటుంది కదా. నిజానికి పార్టీ స్థాపించి 10యేళ్ళయినా సంస్థాగతంగా అభివృద్ధి చేసుకోలేని పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేననే అని చెప్పుకోవాలి. ఇప్పుడైతే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని ఏదో రకంగా జనసేన కొన్ని సీట్లు గెలుచుకోవచ్చు. కానీ రాబోయే ఐదేళ్ళల్లో అయినా జనసేనను గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి చేస్తారా? పార్టీకి పునాదులు లేకుండా ఏదీ కూడా నిలబడదు అన్నది పవన్ కల్యాణ్ ఇప్పటికైనా గుర్తిస్తారా..? చూడాలి.