మరాఠా ఎన్నికలతో మంచి జోష్ మీదున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు సౌత్ పై సీరియస్ ఫోకస్ చేస్తోంది. కీలక నిర్ణయాల దిశగా ఎన్డియే అడుగులు పడుతున్నాయి. జనసేనాని, ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ కు కీలక బాధ్యతలు అప్పగించే దిశగా అడుగులు వేస్తోంది బీజేపి అధిష్టానం. రాజకీయంగా బీజేపికి గత ఏడాది నుంచి కాస్త గడ్డు కాలం నడిచినట్టు కనపడినా ఇప్పుడు మాత్రం మళ్ళీ కంప్లీట్ ఫాం లోకి వచ్చింది. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలతో బిజెపి కార్యకర్తల్లో కూడా జోష్ నింపింది బిజెపి అధిష్టానం.
ఇప్పుడు తర్వాతి టార్గెట్ గా పశ్చిమ బెంగాల్, కర్ణాటకను బీజేపి ఫిక్స్ చేసుకుని అడుగులు వేస్తోంది. తెలంగాణా ఎన్నికలపై ఇప్పటి నుంచే కసరత్తు వేగవంతం చేస్తోంది. రెండేళ్ళలో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఎలా అయినా గెలవాలి అని బీజేపి పట్టుదలగా ఉంది. ఇండియా కూటమిలో మమతా బెనర్జీ చాలా కీలకంగా ఉన్నారు. ఆమెను బలహీనపరిస్తే కాంగ్రెస్ ఇబ్బంది పడటం ఖాయం అనే ధీమాలో ఉంది బీజేపి. అందుకే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ దిశగా అడుగులు వేగవంతం చేస్తోంది.
మరాఠా ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను కంప్లీట్ గా వాడుకున్న బీజేపి… ఇప్పుడు వెస్ట్ బెంగాల్ పై కూడా ఫోకస్ పెడుతోంది. సనాతన ధర్మం పేరుతో పవన్ కళ్యాణ్ దూకుడుగా ఉన్నారు. త్వరలోనే బెంగాల్ లో ఓ బహిరంగ సభను ఎన్డియే పక్షాలతో నిర్వహించాలని బిజెపి యోచిస్తోంది. బెంగాల్ లో తెలుగు వారి సంఖ్య ఎక్కువ. అక్కడ వ్యవసాయ రంగంతో పాటుగా వ్యాపార రంగంలో మన వారి పాత్ర ఎక్కువగా ఉంది. ఇక బెంగాల్ హిందువుల్లో మమతా బెనర్జీపై కోపం ఎక్కువగా ఉంది. రోహింగ్యా ముస్లింలను ఆమె ప్రోత్సహిస్తున్నారని మండిపడుతున్నారు.
అందుకే సువెందు అధికారి వంటి హిందూ బ్యాక్ గ్రౌండ్ ఉన్న నేతలు ఆమెకు గుడ్ బై చెప్పారు. త్వరలోనే మరో నేత కూడా గుడ్ బై చెప్పే ఛాన్స్ కనపడుతోంది.ఈ టైం లో అక్కడ పవన్ ను రంగంలోకి దించి… తెలుగు వారిని ఆకట్టుకునే దిశగా అడుగులు వేగవంతం చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో ఫలితం బాగుంటుంది అని బిజెపి అంచనా వేస్తోంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఢిల్లీ టూర్ లో బిజీగా ఉన్నారు. రేపు పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన భేటీ అవుతారు. ఈ భేటీలో హోం మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా కూడా పాల్గొనే అవకాశం ఉండవచ్చు.
ఈ సందర్భంగా పవన్ కు బెంగాల్ బాధ్యతలను అప్పగించే దిశగా అడుగులు పడే అవకాశం ఉంది. వాస్తవానికి పశ్చిమ బెంగాల్ లో బిజెపికి బలమైన నాయకత్వం కరువైంది. ఉద్వేగ ప్రసంగాలు చేసి యువతను ఆకట్టుకునే నాయకత్వ లోటు ఉంది. అలాగే అక్కడి మహోన్నత వ్యక్తుల గురించి ప్రసంగాలు చేసి యువతను ఆకట్టుకునే నాయకులు కరువయ్యారు. ఈ విషయంలో పవన్ ముందు ఉంటారనే విషయం మరాఠా ఎన్నికల్లో కూడా ప్రూవ్ అయింది. అందుకే పవన్ ను బెంగాల్ లో ప్రయోగించాలని బిజెపి అధిష్టానం గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది.