PAWAN KALYAN: సన్నిహితుడికి షాక్ ఇచ్చిన పవన్‌.. టిక్కెట్ నిరాకరణ

తనకు అత్యంత సన్నిహితుడు, తెలంగాణ జనసేన ఇన్‌చార్జి, పదేళ్ళుగా పార్టీ వ్యవహారాలను చూసుకుంటున్న శంకర్ గౌడ్‌కు.. పవన్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. తెలంగాణలో జనసేన పోటీ చేయబోయే ఎనిమిది సీట్లలో కూకట్‌పల్లి కూడా ఒకటి.

  • Written By:
  • Publish Date - November 8, 2023 / 01:10 PM IST

PAWAN KALYAN: బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన (JANASENA).. తెలంగాణలోనూ పోటీ చేయబోతోంది. 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. లిస్ట్‌లో పేరున్న వారికి.. రాజకీయంగా పెద్దగా పేరు లేకపోవడంపై సోషల్ మీడియాలో జనాలు ఆడుకుంటున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. పవన్‌ చేసిన ఓ పని ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. తెలంగాణలో జనసేన కోసం ఏళ్లుగా పనిచేస్తూ.. తనకు నీడగా ఉన్న వ్యక్తిని పవన్ కల్యాణ్ (PAWAN KALYAN) పక్కనపెట్టారు. ఇది ఆ వ్యక్తికే కాదు.. సొంత పార్టీకే షాకింగ్‌గా ఉంది.

ASSEMBLY ELECTIONS: తెలంగాణలో హంగ్ వస్తే..! ఎన్నికల తర్వాత ఎవరు ఎవరితో..?

తనకు అత్యంత సన్నిహితుడు, తెలంగాణ జనసేన ఇన్‌చార్జి, పదేళ్ళుగా పార్టీ వ్యవహారాలను చూసుకుంటున్న శంకర్ గౌడ్‌ (SHANKAR GOUD)కు.. పవన్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. తెలంగాణలో జనసేన పోటీ చేయబోయే ఎనిమిది సీట్లలో కూకట్‌పల్లి కూడా ఒకటి. ఈ నియోజకవర్గంలో ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ పోటీ చేయబోతున్నట్లు పవన్ ప్రకటించారు. పవన్ ప్రకటనే శంకర్‌ గౌడ్‌కు పెద్ద షాకిచ్చింది. కూకట్‌పల్లిలో పోటీ చేయటానికి శంకర్ గౌడ్ ఆస‌క్తి చూపారు. నియోజకవర్గంలో పార్టీ తరపున పాదయాత్ర కూడా చేశారు. ఇంటింటికి జనసేన అనే కార్యక్రమం నిర్వహించారు. పవన్ పుట్టినరోజున‌, ఆయన సినిమాలు విడుదలైనపుడు.. ఇలా సందర్భం ఏదైనా పెద్దఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. కూకట్‌పల్లిలో పోటీ చేయటానికి శంకర్ గౌడ్.. గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న విషయం కూడా పవన్‌కు తెలుసు. ఇలాంటి శంకర్ పక్కనుండగానే.. పవన్ మాత్రం పార్టీలో కొత్తగా చేరిన ప్రేమ్ కుమార్‌కు టికెట్ ప్రకటించేశారు.

Anasuya Bharadwaj: అనసూయ సెన్సేషనల్ కామెంట్స్.. అడివి శేష్‌ను వదలని అనసూయ

ప్రేమ్ కుమార్ చాలా కాలంగా పార్టీలో ఉన్నారా అంటే అదీలేదు. అసలు రాజకీయాల్లోకి అడుగుపెట్టిందే రెండు నెలల కింద! ముందు బీజేపీలో చేరి రెండు నెలల్లోనే రాజీనామా చేసి నాలుగు రోజుల క్రితమే జనసేనలో చేరారు. చేరిన వెంటనే పవన్ టికెట్ ప్రకటించేశారు. అంటే పార్టీలో చేరటమే ప్రేమ్ కుమార్ టికెట్ హామీ తీసుకునే చేరినట్లు అర్థం అవుతోంది. ఇన్ని ఏళ్లుగా పార్టీలోనే పనిచేస్తూ తనకు నీడలా ఉన్న శంకర్ గౌడ్‌నే పవన్ పక్కనపెట్టేయటం.. పార్టీలో మిగిలిన వాళ్లకు షాక్‌ ఇస్తోంది.