బాలీవుడ్ హీరోలను లేని గట్స్ పవన్ కు… మరాఠా యూత్ ఫిదా

ఏపీ డిప్యూటి సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. అదేంటి ఏ సినిమా లేకుండా పాన్ ఇండియా లెవెల్ లో ఫేమస్ అవ్వడం ఏంటీ అంటారా...? దీని వెనుక పెద్ద కథే ఉంది.

  • Written By:
  • Publish Date - December 3, 2024 / 01:59 PM IST

ఏపీ డిప్యూటి సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. అదేంటి ఏ సినిమా లేకుండా పాన్ ఇండియా లెవెల్ లో ఫేమస్ అవ్వడం ఏంటీ అంటారా…? దీని వెనుక పెద్ద కథే ఉంది. బాలీవుడ్ హీరోలకు మించి ఇప్పుడు నేషనల్ లెవెల్ లో పవన్ ఫేమస్ అయిపోయారు. పవన్ సినిమాల కోసం ఇప్పుడు నేషనల్ లెవెల్ లో వెయిటింగ్ పీక్స్ లో ఉంది. అసలు ఇప్పటి వరకు పవన్ సినిమా చూడని వాళ్ళు కూడా… పవర్ స్టార్ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఓ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారు.

ఏంటి ఆ కథ అంటే… రీసెంట్ గా పవన్ మహారాష్ట్ర ఎన్నికల్లో బిజేపి తరుపున ప్రచారం చేసారు. ఆ ప్రచారం సూపర్ హిట్ అయింది. అయిదు నియోజకవర్గాల్లో బిజెపిని విజయపథంలో నడిపింది. తెలుగు ఓటర్లను ప్రభావితం చేస్తాడు అనుకున్న పవన్… ఇప్పుడు మరాఠి ఓట్లను కూడా ప్రభావితం చేసి బిజేపిని అక్కడ సూపర్ హిట్ చేయడంలో తన వంతుగా కీ రోల్ ప్లే చేసారు. అప్పటి వరకు పవన్ ను అసలు అక్కడి ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదు. జస్ట్ ఆయన ఒక తెలుగు హీరో… ఏపీ పొలిటీషియన్ అని మాత్రమే ఐడియా ఉంది.

కొంత మందికి అసలు ఆయన ఎవరో కూడా తెలియదు. కాని పవన్ టూర్ కు అక్కడ వచ్చిన రెస్పాన్స్ చూసి… బిజేపి నేతలు కూడా షాక్ అయ్యారు. అందుకే ఇప్పుడు పవన్ సినిమాలకు అక్కడ క్రేజ్ పెరిగింది. ఆయన తర్వాతి ప్రాజెక్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అంటూ మరాఠి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. దానికి పెద్ద కారణమే ఉంది… ఇప్పటి వరకు ఏ బాలీవుడ్ హీరో కూడా సనాతన ధర్మాన్ని ఆ రేంజ్ లో ప్రమోట్ చేయలేదు. ధైర్యంగా మేము హిందువులం అని చెప్పుకుని ముందుకు వచ్చే సాహసం కూడా చేయరు.

వాళ్ళ భయాలు వాళ్ళవి… కాని పవన్ కు ఆ భయం అసలు లేదు. ఇది మరాఠి ఫ్యాన్స్ కు పిచ్చ పిచ్చగా నచ్చింది. తమ రాష్ట్రంలో ఉన్న ఏ హీరోకు లేని గట్స్ పవన్ కు ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు పవన్ అక్కడ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. అసలు పవన్ ఎవరూ అంటూ… మహారాష్ట్ర బోర్డర్ స్టేట్స్ కూడా ఆరా తీయడం స్టార్ట్ చేసాయి. ముఖ్యంగా హిందూ యూత్ కు పవన్ బాగా కనెక్ట్ అయ్యారు. కర్ణాటకలో కూడా పవన్ కు ఇమేజ్ బాగా పెరిగింది. త్వరలోనే సనాతన ధర్మం పేరుతో పవన్ యాత్రలకు సిద్దమవుతున్నారు. ఈ యాత్రల్లో కాషాయ కండువాతో పవన్ లుక్ ఉంటుంది. ఇది కూడా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో పవన్ ను ఫేమస్ చేసింది.