Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌.. మీరెక్కడ..? జనాల్లోకి వచ్చే మూడ్ ఉందా.. లేదా..?

అటు చంద్రబాబు నియోజకవర్గాలన్నీ చుట్టి వస్తున్నారు. వైసీపీని ఘాటుగా విమర్శిస్తున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయ్. తెలుగు రాష్ట్రాల్లో ఇంత జరుగుతుంటే పవన్ మాత్రం సైలెంట్‌గా ఉంటున్నారు. షూటింగ్‌లు కంప్లీట్‌ చేసి ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలు అని చెప్తున్నారు ఎవరు అడిగినా!

  • Written By:
  • Updated On - April 28, 2023 / 06:50 PM IST

Pawan Kalyan: పార్ట్‌టైమ్ పొలిటీషియన్ అని వెక్కిరిస్తుంటారు వైసీపీ నేతలు పవన్‌ను! వాళ్ల మాటలు నిజం చేయడానికే అన్నట్లు ఉంటాయి.. జనసేనాని అడుగులు కూడా! సడెన్‌గా వస్తారు.. పుస్తకాల పేర్లు చదువుతారు.. వైసీపీని నాలుగు మాటలు అంటారు.. పొత్తుల గురించి ఓ నవ్వు నవ్వుతారు.. మీటింగ్‌లు అంటారు.. ఫైటింగ్‌లు చేద్దామంటారు.. ఆ తర్వాత మళ్లీ కనిపించరు. సరిగ్గా గమనించాలే కానీ.. పార్టీ పెట్టిన పదేళ్లలో ఇదే పరిస్థితి ప్రతీసారి. పవన్ ఎప్పుడు వస్తారో, ఎందుకు వస్తారో.. పాపం జనసైనికులకు కూడా అంతుచిక్కని పరిస్థితి.

అభిమానం చంపుకోలేక, ఆప్యాయత ఆపుకోలేక.. వాళ్లు అలా ఎదురుచూస్తుంటారు అంతే! ఈ మాత్రం రాజకీయం చేసే పవన్ ఏపీలోనే కాదు.. తెలంగాణలోనూ పోటీ చేస్తానంటూ ప్రకటనలు చేస్తారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో రాజకీయం రంజు మీద కనిపిస్తోంది. తెలంగాణలో అయితే ఎన్నికల మూడ్ మొదలైంది. పార్టీలన్నీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయ్. ఇక ఏపీలో అయితే వివేకా ఎపిసోడ్‌తో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. అటు చంద్రబాబు నియోజకవర్గాలన్నీ చుట్టి వస్తున్నారు. వైసీపీని ఘాటుగా విమర్శిస్తున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయ్. తెలుగు రాష్ట్రాల్లో ఇంత జరుగుతుంటే పవన్ మాత్రం సైలెంట్‌గా ఉంటున్నారు. షూటింగ్‌లు కంప్లీట్‌ చేసి ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలు అని చెప్తున్నారు ఎవరు అడిగినా! నేను పరిగెత్తిన రోజే పందెం అంటే బాగోదు పవన్ అని.. ఆయన వెనకే గుసగుసలాడుకుంటున్నారు చాలామంది! ఎన్నికల కోసం వారాహి అని సిద్ధం చేశారు.

వెహికల్‌ రెడీ చేసినంత స్పీడ్‌గా పవన్ కార్యాచరణ ఉండడం లేదు అదేంటో! అసలు పవన్ జనాల్లోకి వస్తారా? రారా? వస్తే ఎప్పుడు? ఈలోపు పుణ్యకాలం కాస్తా అయిపోతే పరిస్థితి ఏంటి? ఇవే ప్రశ్నలు ఇప్పుడు జనసైనికులను వేధిస్తున్న పరిస్థితి. ఆ మధ్య వారాహి విషయంలో హడావిడి చేసిన జనసైనికులు ఇప్పుడు పూర్తిగా కూల్ అయ్యారు. పవన్ సినిమాలతో బిజీ అయ్యారు. త్వరలో పోలవరం పర్యటన అంటున్నారు ఒకవేళ పోలవరం ప్రాజెక్ట్ పర్యటనకు పవన్‌ వచ్చినా జరిగేదేంటి? వైసీపీని విమర్శిస్తారు. కేంద్రానికి సలహాలిస్తారు. దీనివల్ల జనసేనకు కలిగే లాభమేంటనే ప్రశ్న ఇప్పుడు జనసేన కాంపౌండ్‌లోనే వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాల్లో రాజకీయంగా లాభపడాలి.

అంతేతప్ప.. నేను వచ్చిన రోజే రాజకీయం అనుకుంటే మళ్లీ నిండా మునగడం ఖాయం. ఇప్పుడు పవన్ తెలుసుకోవాల్సింది అదే. బలం పెంచుకోవాలి అనుకుంటున్న పార్టీగా ఇప్పుడు చాలా అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడు కూడా బయటకు రాకపోతే జనాల్లో తిరగకపోతే.. ఆ తర్వాత తిరిగినా, ఉన్నా పెద్దగా లాభం ఉండదు. తన చుట్టే రాజకీయం తిరుగుతుంది కదా.. తన అడుగులకు అనుగుణంగా రాజకీయం మారుతుంది అనుకుంటే.. దాన్ని మించి అమాయకత్వం ఉండదు. ఇప్పటికైనా పవన్ ఈ విషయాలు తెలుసుకోవాలి. అందుకే ఇప్పటికైనా పవన్ జనాల్లోకి రావాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.