Pawan Kalyan : పవన్ కల్యాణ్ తప్పుచేశాడా.. ? ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు ..?

NDA లో భాగస్వామిగా కొనసాగుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకొని తమ అభ్యర్థులను కూడా రంగంలోకి దించాడు. ఆ పార్టీలో సీట్ల షేరింగ్ పై చర్చలు పూర్తికాగానే.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సభలో పాల్గొనాలని పవన్ కు ఆహ్వానం వచ్చింది.

NDA లో భాగస్వామిగా కొనసాగుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకొని తమ అభ్యర్థులను కూడా రంగంలోకి దించాడు. ఆ పార్టీలో సీట్ల షేరింగ్ పై చర్చలు పూర్తికాగానే.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సభలో పాల్గొనాలని పవన్ కు ఆహ్వానం వచ్చింది. దాంతో ఆయన మీటింగ్ లో పాల్గొన్నాడు.. ప్రధాని మోడీ పక్కన కూర్చొని మాట్లాడాడు కూడా. ఇంతవరకూ బాగానే ఉంది. పవన్ కల్యాణ్ ఆ సభలో చేసిన ప్రసంగంపై ఆంధ్రప్రదేశ్ లో జనం మండిపడుతున్నారు.

Telangana Elections : అహంకారమే అసలు సమస్య.. అస్సలు భరించలేమంటున్న జనం

ప్రధాని మోడీ (Modi)ని ఆకాశానికి ఎత్తేసి.. ఆయనే మళ్లీ ప్రధాని కావాలని చెప్పుకొచ్చిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరో తప్పు చేశాడని అంటున్నారు. ఈ స్పీచ్ తో ఏపీలో తన ఓటు బ్యాంకును తానే పోగొట్టుకున్నారని తెలుస్తోంది. ఎందుకంటే ఏపీలో బిజెపి అంటే జనం మండిపడుతుంటారు. ఆ రాష్ట్రాన్ని అడ్డంగా విభజించిన కుట్రలో కాంగ్రెస్ తో పాటు బీజేపీకి కూడా భాగస్వామ్యం ఉంది. ఏపీకి ప్యాకేజీలు, ప్రత్యేక హోదాలు ఇస్తామని హామీ ఇచ్చి.. వాటిని పదేళ్ళవుతున్నా ఇప్పటి వరకూ నెరవేర్చలేదు. ఏపీ అభివృద్ధికి బీజేపీ చేసింది సున్నా.. రాజధాని నిర్మాణానికి కూడా నిధులు కేటాయించలేదన్న విమర్శలు ఉన్నాయి. దాంతో పదేళ్ళుగా సరైన కేపిటల్ సిటీనే నిర్మించుకోలేని పరిస్థితుల్లో ఉంది ఏపీ.

తెలంగాణ (Telangana) విడిపోవడంతో భారీగా నిధులు కోల్పోయి అప్పుల్లో కూరుకుపోయిన ఏపీకి… కేంద్రంలో పదేళ్ళుగా ఉన్న బీజేపీ చేసింది ఏంటి అని జనం ప్రశ్నిస్తున్నారు. పైగా తన ప్రతి అవసరానికి జగన్ సర్కార్ ని వాడుకొని.. ఏపీ బాగోగులను మాత్రం గాలికి వదిలేసింది NDA సర్కార్. ఈ ఆవేదన జనం అందరిలోనూ కనిపిస్తోంది. బీజేపీ ఒంటరిగా పోటీచేస్తే అక్కడ ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు. అలా ఏపీ జనం ఆగ్రహంగా ఉన్న పార్టీపై, కోపంతో ఉన్న వ్యక్తిపై పవన్ కళ్యాణ్ అపారమైన ప్రేమను చూపించడం.. జనానికి మింగుడు పడటం లేదు. బీజేపీ అన్నా.. ప్రధాన మోడీ అన్నా.. ఏపీ జనం రగిలిపోతున్నారు. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు పరోక్షంగా పవన్ కళ్యాణ్ కి కూడా తగలక మానదు.

టీడీపీకి పూర్తిగా తెలుసు. బీజేపీతో కలిసి వెళ్తే ఎవరైనా రాజకీయంగా నాశనం అవుతారు అని. తన రాజకీయం కోసం బిజెపి ఏపీని భ్రష్టు పట్టించిందనేది అందరి మనసులో ఉంది. అందుకే బీజేపీతో పొత్తుకు టీడీపీ కూడా భయపడుతోంది. అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్.. ఒకే వేదికపై మోడీతో కలసి కూర్చోవడం.. ఆయన్ని ఆకాశానికి ఎత్తేయడం ఏపీ జనానికి నచ్చడం లేదు. వీరి కలయికను రాబోయే రోజుల్లో ఏపీ జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు.. ఏం నిర్ణయిస్తారు అన్నది చూడాలి.