మోడీ గిఫ్ట్ పై పవన్ రియాక్షన్

కేంద్ర ప్రభుత్వం దాదాపు 2500 కోట్లతో కొత్త రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఏపీ సిఎం చంద్రబాబు, డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేసారు.

  • Written By:
  • Publish Date - October 24, 2024 / 06:14 PM IST

కేంద్ర ప్రభుత్వం దాదాపు 2500 కోట్లతో కొత్త రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఏపీ సిఎం చంద్రబాబు, డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేసారు. అమరావతికి రైల్వే లైన్‌ ఇచ్చినందుకు ప్రధానికి కృతజ్ఞతలు చెప్పారు చంద్రబాబు. ఈ రైల్వే లైన్‌తో దేశంలోని అన్ని నగరాలకు అమరావతి కనెక్ట్‌ అవుతుంది అన్నారు. నాలుగేళ్లలో ఈ రైల్వే లైన్ పూర్తవుతుందని తెలిపారు.

మూడేళ్లలోనే పూర్తి చేస్తే ఎంతో ఉపయోగకరం అన్నారు ఆయన. భూసేకరణకు అవసరమైన అన్ని చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నా అన్నారు. వచ్చే నెలలో ఈ రైల్వే లైన్ ప్రాజెక్ట్ శంకుస్థాపనకు ప్రధానిని ఆహ్వానిస్తున్నామని తెలిపారు. దీనిపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ఈ కొత్త లైన్ ఏపి కి చాలా బిగ్ బూస్ట్ అవుతుంది అన్నారు. దూరదృష్టితో మేజర్ పోర్టులైన మచిలీపట్నం, కృష్ణ పట్నం పోర్టులను కలిపే ప్రణాళిక ఉండటం ఎంతో ఉపయుక్తం అని తెలిపారు. టైమ్ లైన్ ను 4 ఏళ్లనుండి 3 ఏళ్ళకు టైమ్ లైన్ ను తగ్గించగలిగితే అది మంచి అచీవ్మెంట్ అవుతుందన్నారు.