అయోధ్యకు లడ్డూలు పంపింది ఎవరు…? పవన్ సంచలన కామెంట్స్

టీటీడీ లడ్డూలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అయోధ్య రామ మందిరం ప్రారంభ సమయంలో టిటిడి నుంచి లక్ష లడ్డూలు పంపించే కార్యక్రమం చేపట్టారు అని అపవిత్రంగా తయారుచేసిన లక్ష లడ్డూలు అయోధ్య కి పంపించింది ఎవరు అని నిలదీశారు పవన్.

  • Written By:
  • Publish Date - September 22, 2024 / 11:04 AM IST

టీటీడీ లడ్డూలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అయోధ్య రామ మందిరం ప్రారంభ సమయంలో టిటిడి నుంచి లక్ష లడ్డూలు పంపించే కార్యక్రమం చేపట్టారు అని అపవిత్రంగా తయారుచేసిన లక్ష లడ్డూలు అయోధ్య కి పంపించింది ఎవరు అని నిలదీశారు పవన్. దేశంలో కోట్లాదిమంది దశాబ్ద కాలంగా ఎదురుచూసిన అయోధ్య రాముడు దర్శించుకున్న భక్తులను కూడా అపవిత్రం చేశారు అని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం అని మాట్లాడుతున్నారు… హిందువుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ప్రశ్నించడం తప్పా అని నిలదీశారు.

అన్ని మతాలను సమానంగా చూసే భూమిలో ఉన్నామన్నారు పవన్. వేరే మతాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాలకు సంబంధించి అపవిత్రం జరిగితే ప్రశ్నించరా అని నిలదీశారు. వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో 219 గుడిలను నాశనం చేశారు మండిపడ్డారు. రామతీర్థం అంశంలో నేను బయటికి వచ్చి ఆందోళన చేయలేదు అన్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ప్రసాదాలు కల్తీలు జరిగాయని తెలుస్తుందన్నారు పవన్. ఈ సాయిలో కల్తీ జరుగుతుందని ఎవరూ ఊహించలేదు అని… సహజంగా నెయ్యిలో కల్తీ జరుగుతుంది కానీ తిరుపతి లడ్డులో జరిగిన కల్తీ అత్యధికంగా జరిగిందని మండిపడ్డారు.

ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి పైన ఉందన్నారు పవన్. ప్రతికారాలు తీర్చుకునే ప్రభుత్వం కాదు… టిటిడి బోర్డు సభ్యులందరూ కూడా ఎంత అపరవిత్రం జరుగుతుంటే ఏం చేస్తున్నారు అని నిలదీశారు. రాజకీయ పదవులు పొందడం కాదు దేవాలయ పవిత్రతను కూడా కాపాడాల్సిన బాధ్యత సభ్యులపై ఉందన్నారు. తిరుపతి లడ్డుకు సంబంధించి ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకున్న క్యాబినెట్ ఆమోదం ఉంటుంది అని స్పష్టం చేసారు. టిటిడి ఉద్యోగులందరూ బాధ్యత వహించాలి అని తెలిపారు. టీటీడీ ఉద్యోగులు వైఎస్ఆర్సిపికి భయపడి సైలెంట్ గా ఉన్నారా అని నిలదీశారు.