తిరుపతి వారాహీ బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. “నా కూతురును తిరుమలకు తీసుకొస్తే డిక్లరేషన్ ఇప్పించాను. ఏ దారిలో సంకెళ్లు ఉన్నా సవాలుగా తీసుకుని ముందుకు వెళతాను. సనాతన ధర్మంపై అచెంచల విశ్వాసం ఉంది. జంతువుల కొవ్వుతో లడ్డు ప్రసాదాలు తయారు చేశారు. జంతువులు కొవ్వుతో తయారైన లక్ష లడ్డూలను కూడా అయోధ్యకు పంపారు. సనాతన ధర్మాన్ని మాట్లాడినా కోర్టులు కూడా పట్టించుకోవడం లేదు. అయినవారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్నట్లు పరిస్థితి ఉంది
హిందూ సమాజంపై దాడి జరిగితే సూడో సెక్యులరిస్ట్ లు మాట్లాడరు. రాముడికి అవమానం జరిగితే ఇళ్ళల్లో కూర్చుని మనం ఏడుస్తున్నాం. రాముడు ఉత్తరాది దేవుడని, ఆర్యుడని భావిస్తున్న పరిస్థితి ఉంది. బయటకు వచ్చి మాట్లాడితే మత వాదులన్న ముద్ర వేస్తారని భయం ఉంది. సనాతన ధర్మాన్ని పాటించేవాడు మత విద్వేషాలను రెచ్చగొట్టడు. ఎన్నికలు పెడితే వైసీపీ ని ఒక్కటికి పరిమితం చేస్తాం. భిన్నత్వంలో ఏకత్వం అంటే సనాతన ధర్మాన్ని చంపడం కాదు. సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తాం, మసి చేస్తామంటే చేతులు కట్టుకొని కూర్చోలేదు.
సనాతన ధర్మంపై దాడి జరిగితే ఏ ఒక్కరో మాట్లాడడం లేదు. హిందూ ధర్మంపై మాట్లాడితే శాంతిని పాటించ మంటారు. అల్లా, యేసుక్రీస్తు పై మాట్లాడితే ధ్వంసం చేస్తారు. మర్యాద ఇవ్వండి మర్యాద తీసుకోండి. 11 రోజుల దీక్షతో శ్రీవారిని దర్శించుకున్న తరువాత వారాహీ డిక్లరేషన్ ఇస్తున్నాం. కశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు సనాతన ధర్మాన్ని గౌరవించేలా వారాహి డిక్లరేషన్ ను ప్రకటిస్తున్నాం. సనాతన ధర్మాన్ని త్రికరణ శుద్ధితో ఆచరించే వ్యక్తిగా వారాహి డిక్లరేషన్ ను ప్రకటిస్తున్నాం.
గత ప్రభుత్వంలో సీఎం లడ్డూలు తయారు చేశాడని చెప్పలేదు. తప్పు జరిగిందని చెప్పాం. లడ్డు విషయంలో రాజకీయం చేస్తున్నామంటున్నారు. సుప్రీంకోర్టుకు వెళ్ళిన వాళ్ళు డ్రామాలు చేయవద్దు. వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి మాట్లాడం సరే. పాత ఈఓ ధర్మారెడ్డి ఎక్కడ మాయమయ్యాడు. పాత ఈఓ ఎక్కడున్నారు. ఎందుకు మాట్లాడటం లేదు…? బిడ్డ చనిపోతే ఆచారాలు పాటించ కుండా ఆలయంలోకి వచ్చారు. గతంలో జరిగిన ధర్మారెడ్డి అవినీతిని కూడా బయట పెడతాం. గత 5 ఏళ్లలో 31 వేల మంది ఆడబిడ్డలు మాయం అయ్యారు. సనాతన ధర్మాన్ని ముట్టుకుంటే మసి కావాల్సిందే. తిరుమల ప్రసాదం కల్తీ చిన్నది కాదు. సనాతన ధర్మంపై జరిగిన దాడి.” అంటూ పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు.