PAWAN KALYAN: పంచుల్లేని పవన్ ప్రసంగం.. బీజేపీ సభలో అంటీ ముట్టనట్టు..!

పవన్ హాజరైంది బీసీల ఆత్మ గౌరవ సభకు. ఇక పవన్ చెలరేగి పోతాడని అందరూ ఊహించారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడతాడనీ, కాళేశ్వరం, మద్యం టెండర్లు ఇంకా BRS పెద్దల అవినీతిని ఎండగడతారని అనుకున్నారు ఆయన అభిమానులు.

  • Written By:
  • Publish Date - November 8, 2023 / 02:25 PM IST

PAWAN KALYAN: బీజేపీ (BJP) ఆధ్వర్యంలో బీసీల ఆత్మగౌరవ సభను సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించారు. ఇందులో ప్రధాని నరేంద్రమోదీ (PM MODI) పాల్గొనగా.. జనసేన (JANASENA) అధినేత పవన్ కల్యాణ్ (PAWAN KALYAN) స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. మోడీ.. పవన్ పేరు చెప్పగానే.. జనంలో ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఇంతవరకూ బాగానే ఉంది. జనరల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నాడు అంటే.. పవర్ పంచ్‌లు పేలుతాయి. గుండెల్లో నిద్రపోతా.. అవినీతిని తరిమి కొడతా.. ఇంకా ఇలాంటి ఎన్నో పంచ్ డైలాగ్స్ వదులుతుంటారు పవన్. ఏపీలో జగన్‌తో పాటు మంత్రులను టార్గెట్ చేస్తారు. తెలంగాణలో బీజేపీతో కలిసి సీట్లు షేరింగ్ చేసుకుంటోంది జనసేన.

PAWAN KALYAN: సన్నిహితుడికి షాక్ ఇచ్చిన పవన్‌.. టిక్కెట్ నిరాకరణ

పవన్ హాజరైంది బీసీల ఆత్మ గౌరవ సభకు. ఇక పవన్ చెలరేగి పోతాడని అందరూ ఊహించారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడతాడనీ, కాళేశ్వరం, మద్యం టెండర్లు ఇంకా BRS పెద్దల అవినీతిని ఎండగడతారని అనుకున్నారు ఆయన అభిమానులు. గతంలో వరంగల్‌లో మాట్లాడినప్పుడు కూడా కేసీఆర్ తాట తీస్తానని అనడం జనసేన కార్యకర్తలకు, పవన్ అభిమానులకు ఇంకా గుర్తుంది. ఈసారి పవన్ ప్రసంగంలో అలాంటి డైలాగ్స్ ఏమీ రాలేదు. తాను రాసుకొచ్చుకున్న స్క్రిప్ట్‌ను పొల్లు పోకుండా చదివి వెళ్ళిపోయాడు పవన్. మోడీ ఎన్నికల కోసం కాకుండా.. ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు, నోట్ల రద్దు… లాంటివి ప్రస్తావించారు. దేశాన్ని ప్రపంచంలో నెంబర్1గా నిలబెట్టే సత్తా ఉన్న నాయకుడని, అందుకే మోడీ అంటే ఇష్టమని చెప్పారు జనసేనాని.

ASSEMBLY ELECTIONS: తెలంగాణలో హంగ్ వస్తే..! ఎన్నికల తర్వాత ఎవరు ఎవరితో..?
సికింద్రాబాద్ సభలో పవన్ కల్యాణ్ స్టేజీ ఎక్కిన దగ్గర నుంచి అంటీ ముట్టనట్టుగానే వ్యవహరించాడు. మరో ఐదేళ్ళ పాటు పేదలకు ఐదు కేజీల ఉచిత బియ్యం కొనసాగిస్తామన్న మోడీ.. అందుకు మద్దతుగా మొబైల్ ఫ్లాష్ వెలిగించాలని పిలుపు ఇచ్చారు. దాంతో స్టేజీ మీద ఉన్న బీజేపీ లీడర్లతో పాటు కింద ఉన్న ప్రజానీకం కూడా వెలిగించారు. బట్ పవన్ మాత్రం కొద్దిసేపు చప్పట్లు కొట్టారు. మరికొద్దిసేపు చేతులు కట్టుకున్నారు. మొత్తమ్మీద సభ కొనసాగుతున్నంత సేపు పవన్ కల్యాణ్ అంటీముట్టనట్టుగా కనిపించారే తప్ప. అంత యాక్టివ్‌గా ఉన్నట్టు లేరు. తెలంగాణలో పవన్ కల్యాణ్ దూకుడు ఎందుకు తగ్గిందో అర్థం కావడం లేదు. అధికారి BRSకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడ లేదని బీజేపీ లీడర్లలో చర్చ జరుగుతోంది. సరే.. రేపు జనసేన అభ్యర్థుల ప్రచారంలో అయినా పవన్ దూకుడు ప్రదర్శిస్తారా.. ఏపీలో మాట్లాడినట్టుగా.. పవర్ పంచ్‌లు పేలుస్తారా అన్నది చూడాలి. కేసీఆర్‌ను పవన్ టార్గెట్ చేస్తేనే తమకు మేలేజ్ వస్తుందని బీజేపీ భావిస్తోంది.