డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్.. వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అధికారులపై దాడి చేయడం వైసిపి కొత్త కాదని ఇది వైసిపి రాజ్యం అనుకుంటున్నారని… అధికారులపై దాడి చేస్తే తోలు తీస్తా అని వార్నింగ్ ఇచ్చారు. జవహర్ బాబు ను అమానుషంగా కొట్టారన్నారు. జవహర్ బాబు కు హైబీపీ తో పాటు ఆరోగ్య సమస్యలు ఉన్నాయన్నారు. ఎవరి మీదైనా దాడి చేస్తే గత ప్రభుత్వం లా చూస్తూ ఊరుకోమని ఇష్టా రాజ్యంగా అధికారులు దాడి చేస్తే ఉపేక్షిఃచం అని వార్నింగ్ ఇచ్చారు. ఘటనా స్థలానికి సిఐ వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్ కాలేదన్నారు.
అహంకారంతో దాడి చేస్తే తోలు తీసి కూర్చోపెడతాం హెచ్చరించారు. అహంకారం తో కళ్ళు నెత్తికెక్కాయన్నారు. ఇది కూటమి ప్రభుత్వం వైసిపి కాదని ఎలా నియంత్రించాలో తెలుసు చేసి చూపిస్తామన్నారు. ఎస్సీ ఎస్టీ అని కాదు ఎవరైనా సరే ఆధిపత్య దోరణిలో ఎవరి మీద చేసినా ఇలాగే స్పందిస్తామన్నారు. పరారిలో ఉన్నా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారని మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు అని హెచ్చరించారు. రాయలసీమ లో మహిళల ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. 11 సిట్లు వచ్చినా వారి అహంకారం తగ్గలేదని… క్షమించే ప్రశ్నే లేదన్నారు.