ఎవరికి ఎవరు బలం అయ్యారు? బాబు కి పవన్ ఎన్ని మార్క్స్ వేశాడు?

జనసేన ఆధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్... టీడీపీకి ఎంత బలమో తెలియదు గాని కచ్చితంగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కచ్చితంగా బలమే.

  • Written By:
  • Publish Date - September 19, 2024 / 05:19 PM IST

జనసేన ఆధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్… టీడీపీకి ఎంత బలమో తెలియదు గాని కచ్చితంగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కచ్చితంగా బలమే. ఆ బలం కూడా ఎవరూ ఊహించని బలం. ఎవరు ఎన్ని మాట్లాడినా పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు విషయంలో పక్కా లెక్కతో విపక్షాన్ని కొడుతున్నారు. చంద్రబాబుపై ఈగ వాలనీయకుండా చూడటంలో పవన్ సక్సెస్ అవుతున్నారు. తనకు అధికారం రుచి చూపించారు అనే విశ్వాసమో లేక వైసీపీని తోక్కారనే సంతోషమో తెలియదు గాని పవన్ మాత్రం చంద్రబాబుకి ప్రభుత్వంలో అన్నీ తాను అవుతున్నారు. అలా 5 అంశాల్లో పవన్… చంద్రబాబుకి కొండంత అండ అయ్యారు. అవేంటో చూద్దాం.

చంద్రబాబుని అర్ధం చేసుకోవడం

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన్ను ఎవరూ అర్ధం చేసుకునే వాళ్ళు కాదు. చంద్రబాబు ఏ పని చేసినా సొంత మంత్రి వర్గంలోనే విమర్శలు చేసే వాళ్ళు సైలెంట్ గా. చంద్రబాబు నిర్ణయాలను కేబినేట్ లో సమర్ధించినా తర్వాత ఏదోక కామెంట్ చేసే వాళ్ళు. ఇక చంద్రబాబు పని తీరు విషయంలో కూడా కొందరు మంత్రులు సమర్ధించే వాళ్ళు కాదు. కాని పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం భిన్నంగా జరుగుతోంది. చంద్రబాబు ఏం చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు అనే విషయాన్ని పవన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీడియా ముందుకు గాని మైక్ లో మాట్లాడే అవకాశం గాని వస్తే చాలు పవన్ కచ్చితంగా చంద్రబాబు పని తీరుని కీర్తిస్తున్నారు. బుధవారం కూడా అదే రేంజ్ లో చంద్రబాబు ప్రభుత్వంలో ఎలా పని చేస్తున్నారు, వరదల్లో ఎంత కష్టపడ్డారు అనేది చెప్తూ ఆయన వరదల్లో ఎందుకు దిగాల్సి వచ్చిందో వివరించారు. సొంత పార్టీ మంత్రులు ఎవరూ పవన్ చెప్పినంత వివరంగా చెప్పలేదు.

2 విమర్శలకు చెక్

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన్ను వైసీపీ విమర్శించినా గతంలో కాంగ్రెస్ నాయకులు విమర్శించినా టీడీపీ నేతలు గాని మంత్రులు గాని ఎప్పుడూ కౌంటర్ లు ప్రజల్లోకి వెళ్ళే రేంజ్ లో ఇచ్చిన సందర్భాలు లేవు అనే చెప్పాలి. కీలక నిర్ణయాలపై విమర్శలు వచ్చినా సరే కౌంటర్ లు ఇచ్చేవారు కాదు. కాని పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో భిన్నంగా ఉన్నారు. చంద్రబాబు వరదల్లో ఓవరాక్షన్ చేస్తున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తుంటే… దానికి పవన్ కౌంటర్ ఇచ్చారు. విజయవాడ మేయర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ సర్పంచ్ లు ఏమయ్యారు అని నిలదీశారు పవన్. ఈ మూడు నెలల్లో పవన్ కీలక విషయాల్లో కౌంటర్ లు సైలెంట్ గా ఇచ్చారు. ఇక చంద్రబాబు మానస్తత్వం ఎలా ఉంటుందో కూడా పవన్ చెప్పే ప్రయత్నం చేసారు. వైసీపీని ఎక్కడా ఘాటుగా విమర్శించకుండా చాలా పద్దతిగా కౌంటర్ లు ఇవ్వడం మొదలుపెట్టారు. చంద్రబాబుకి ప్రభుత్వంలో ఇన్నేళ్ళు ఉన్నా ఇలా ఎవరూ సపోర్ట్ చేయలేదు.

పొత్తు సమస్యలు

చంద్రబాబు నాయుడు గతంలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా సరే… ప్రభుత్వాన్ని నడపడం కంటే వారి కోరికలు తీర్చడానికి, డిమాండ్ లు పరిష్కరించడానికే చంద్రబాబు సమయం కేటాయించేవారు అనే ఆవేదన టీడీపీ నేతల్లో ఉండేది. కాని పవన్ పొత్తులో ఉండటంతో ఎక్కడా సమస్యలు ఇప్పటి వరకు అయితే రాలేదు. తనకు ఏం కావాలో డిమాండ్ చేయడం కూడా పవన్ చేయడం లేదు. మంత్రి పదవుల విషయంలో పవన్ కళ్యాణ్ పెద్దగా పట్టుబట్టినట్టు కూడా ఏం లేదు. గతంలో సీట్ల విషయంలో కూడా పవన్… టీడీపీని ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయితే లేదు. జనసేన నేతలతో కఠినంగా చెప్పిన పవన్… టీడీపీ తో మాత్రం సఖ్యతగానే వెళ్ళారు.

ఎమ్మెల్యేలు మంత్రులపై పట్టు…

ప్రభుత్వాలకు ముందు చెడ్డ పేరు తెచ్చేది మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు. కాని జనసేన విషయంలో మాత్రం పవన్ పక్కా లెక్కతో వెళ్తున్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని ఎక్కడా అవినీతికి పాల్పడవద్దు అనే ఆదేశాలు పక్కాగా జారీ చేసారు పవన్. నేను పని చేస్తా మీరు కూడా చేయాల్సిందే అంటూ ఎమ్మెల్యేలకు మంత్రులకు బలమైన సిగ్నల్స్ ఇచ్చారు. ఇసుక, అక్రమ మైనింగ్, యెర్ర చందనం ఇలా ఏ వ్యవహారంలో ఎమ్మెల్యేలు ఉన్నా సరే క్షమించే ప్రసక్తే లేదని స్పష్టంగా చెప్పారు పవన్. రాజకీయంగా పార్టీకి చెడ్డ పేరు తీసుకు రావద్దని, ప్రభుత్వానికి రానివ్వవద్దని… అలాగే చంద్రబాబు నిర్ణయాలు నచ్చకపోతే మంత్రులు తన దృష్టికి తీసుకు రావడమే గాని మీడియా సమావేశాల్లో గాని ఇతర వ్యక్తుల వద్ద గాని నోరు జారవద్దని కఠినంగా చెప్పేశారు.

బిజెపితో సమస్యలు లేకుండా

బిజేపిని టీడీపీని కలపడంలో ఎన్నికల ముందు కీలక భూమిక పోషించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా ఈ రెండు పార్టీల మధ్య వారధిలా ఉన్నారనే చెప్పాలి. రాష్ట్రంలో బిజెపి ఎమ్మెల్యేలు మంత్రులు పవన్ తో ఎక్కువగా టచ్ లో ఉంటున్నారు. గతంలో… బిజెపి నేతలు పదే పదే నోరు జారేవారు. కాని ఇప్పుడు అలాంటి పరిస్థితి కనపడటం లేదు. బిజెపి రాష్ట్ర నాయకత్వంతో కూడా సఖ్యత కొనసాగిస్తూ జాగ్రత్తగా రాజకీయం చేస్తున్నారు. ఎన్డియేలో మూడు పార్టీల ఎమ్మెల్యేలతో పవన్ కు మంచి సంబంధాలే ఉన్నాయి. జిల్లాల్లో టీడీపీ నేతలకు జనసేన నేతలకు విభేదాలు రాకుండా ఉండేందుకు పవన్ తన మార్క్ పని తీరుతో సెట్ చేస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబుకి గతంలో తరహా సమస్యలు వచ్చే అవకాశం కనపడటం లేదు.

5 పాలనపై పట్టు

పాలన విషయంలో ఉండే సమస్యలు పవన్ కు అవగాహన తక్కువ. అందుకే ఆయన చంద్రబాబు తీసుకునే నిర్ణయాలను, చేసే పర్యటనలను, అధికారులకు ఇచ్చే ఆదేశాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు. బుధవారం జరిగిన ఎన్డియే మీటింగ్ లో కూడా పవన్ అదే విషయాన్ని స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేసారు. పాలనలో ఉండే సమస్యలు అర్ధం చేసుకుని వాటిని మీడియా ముందు చెప్తున్నారు. గతంలో జరిగిన తప్పులను మీడియా ముందు చెప్తున్నారు. పరిపాలనలో తనపై విమర్శలు రాకుండా ఉండటానికి జాగ్రత్తగా పవన్ ప్రయత్నం చేస్తున్నారు. సీనియర్ అధికారులు తనకు ఏదైనా చెప్తున్నా పవన్ నేర్చుకుంటున్నారు. ఎక్కడా కూడా పవన్ అసంతృప్తిగా ఉన్నట్టుగా ఈ వంద రోజ్జుల్లో కనపడలేదు అనే చెప్పాలి.

ఇలా పలు కీలక అంశాల్లో పవన్ కళ్యాణ్… చంద్రబాబుకి బాలంగా మారడంతో అటు వైసీపీకి కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉంది. పాలనలో జోక్యం చేసుకోకపోయినా తన పార్టీని బలోపేతం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ పక్కాగా ముందుకు వెళ్తున్నారు. వైసీపీ నుంచి వచ్చే కొందరు నేతలను జనసేనలోకి తీసుకుంటున్నారు. దాదాపు పది మంది మాజీ ఎమ్మెల్యేలు జనసేనలో చేరుతున్నారు.