PAWAN KALYAN: ఢిల్లీకి పవన్.. బీజేపీ నేతలతో సోమవారం భేటీ..

ఇప్పటికే చంద్రబాబు నాయుడు.. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలను కలిశారు. ఆ మరుసటి రోజే ఏపీ సీఎం జగన్‌తోనూ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. జగన్.. ప్రధాని మోదీని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. ఇక మిగిలింది పవన్ మాత్రమే.

  • Written By:
  • Publish Date - February 10, 2024 / 07:36 PM IST

PAWAN KALYAN: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. పొత్తులపై బీజేపీ నేతలతో చర్చించనున్నారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, జనసేన పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు.. బీజేపీని కూడా కలుపుకోవాలని చంద్రబాబు, పవన్ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు.. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలను కలిశారు.

KCR: సార్‌ మళ్లీ డుమ్మా.. కేసీఆర్‌ అసెంబ్లీకి ఎందుకు రాలేదంటే..

ఆ మరుసటి రోజే ఏపీ సీఎం జగన్‌తోనూ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. జగన్.. ప్రధాని మోదీని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. ఇక మిగిలింది పవన్ మాత్రమే. అందుకే బీజేపీ అధిష్టానం పవన్‌ను ఢిల్లీకి పిలిచినట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో పవన్ ఢిల్లీకి వెళ్లొచ్చు. బహుశా సోమవారం పవన్ ఢిల్లీ పర్యటన ఉంటుంది. అక్కడ బీజేపీ అగ్రనేతలతో పవన్ భేటీ అవుతారు. ఈ సందర్భంగా పొత్తులపైనే చర్చించే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల్లో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్యపై పవన్, బీజేపీ నేతలు చర్చించే చాన్స్‌ ఉంది. పోటీ చేసే స్థానాలపై ఈ భేటీలో బీజేపీ, జనసేన ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంది.

చంద్రబాబు, జగన్ పర్యటన తర్వాత పవన్ ఢిల్లీ టూర్ రాజకీయవర్గాల్లో ఆసక్తి కలిగిస్తుంది. మరి ఈ భేటీలో అయినా బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులపై ఒక స్పష్టత వస్తుందేమో చూడాలి.