PAWAN KALYAN: ఎన్నికల సమీపిస్తున్న వేళ.. ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయ్. పొత్తులు, ఎత్తులు.. పాలిటిక్స్‌ను మరింత హీటెక్కిస్తున్నాయ్. టీడీపీతో జనసేన పొత్తులో ఉంది. బీజేపీ కూడా చేరబోతుందనే చర్చ జరుగుతోంది. టికెట్ల సర్దుబాటు వ్యవహారంపై ఇంకా క్లారిటీ రాకముందే.. ఏపీ రాజకీయాల్లో కొత్త ప్రచారం మొదలైంది. ఎమ్మెల్యేతో పాటు.. ఎంపీగానూ పోటీ చేసేందుకు పవన్ రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
REVANTH REDDY: 80 వేల బుక్స్ చదివి ఏం లాభం.. కేసీఆర్‌పై రేవంత్ పంచ్.. అసెంబ్లీలో రెచ్చిపోయిన సీఎం
గత ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసిన సేనాని.. పరాభవం ఎదుర్కొన్నారు. ఐతే ఈసారి కూడా రెండు స్థానాలు.. కాకపోతే ఒకటి ఎంపీ, మరొకటి ఎమ్మెల్యే పోటీ అంటూ.. కొత్త ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమిలో జనసేన కీలక పాత్ర పోషించబోతుందని, అందుకే లోక్‌సభకు పోటీ చేయాలని పవన్ ఆలోచిస్తున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయ్. అన్ని అనుకున్నట్లుగా జరిగితే పవన్‌కల్యాణ్ కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఇక భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి పవన్ పోటీ చేసే చాన్స్ ఉంది. జనసేన మొత్తంగా మూడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఐతే ఇది ప్రస్తుతానికి ప్రచారం మాత్రమే.
దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. టీడీపీ, జనసేన పొత్తు ఖరారు అయినా.. ఈ కూటమిలోకి బీజేపీ చేరబోతుందని వార్తలు వస్తున్నాయ్. జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారనే దానిపైనే.. పవన్ రెండు స్థానాల నుంచి పోటీ చేసే అంశం ఆధారపడి ఉందని తెలుస్తోంది. 2019లో గాజువాక, భీమవరం రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేశారు పవన్‌కల్యాణ్. రెండు స్థానాల్లోనూ రెండో స్థానంలో నిలిచి ఓడిపోయారు.