PAWAN KALYAN: వచ్చే ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీకి పవన్ కళ్యాణ్ పోటీ చేయడంలేదా..? ఎంపీగా పోటీ చేసి కేంద్రం నుంచి ఆపరేట్ చేయాలి అనుకుంటున్నారా..? చంద్రబాబు తాను పోటీ చేసే సెగ్మెంట్ ప్రకటించినా.. పవన్ కళ్యాణ్ మాత్రం ఎందుకు సస్పెన్స్‌లో పెట్టారు..? ఓ సగటు జనసేన కార్యకర్తలో ఇప్పుడు ఉన్న కామన్ డౌట్ ఇది. ఏపీ సీఎం జగన్ మీద కలిసి పోరాటం చేస్తున్న పవన్ చంద్రబాబు ఇవాళ తమ అభ్యర్థుల మొదటి లిస్ట్‌ను రిలీజ్ చేశారు. 94 స్థానాల్లో టీడీపీ.. 24 స్థానాల్లో జనసేన పోటీలో దిగుతున్నాయి.
TDP-JANASENA LIST: టీడీపీ 94- జనసేన 5.. టీడీపీలో సీనియర్లు ఔట్..?
చంద్రబాబు ఎప్పటిలాగే కుప్పం నుంచి పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాన్ తన పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఐదుగురు అభ్యర్థుల పేర్లు ప్రకటించారు కానీ.. తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అన్న విషయం మాత్రం ప్రకటించలేదు. దీంతో ఈ మౌనం అనేక అనుమానాలు, విశ్లేషణలకు దారి తీస్తోంది. వచ్చే ఎన్నికల్లో పవన్ అసెంబ్లీకి పోటీ చేయడంలేదని కొందరు విశ్లేషకులంటున్నారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితి చూస్తే.. పవన్ సపోర్ట్ లేకుండా చంద్రబాబు గెలవలేడు. కానీ.. గ్రౌండ్ లెవెల్‌లో అసెంబ్లీకి నిలబెట్టేంత పెద్ద నాయకులు పవన్‌కు లేరు. దీంతో 24 సీట్లకే పరిమితం కాక తప్పలేదు. ఈ 24 సీట్ల గెలిచినా.. సీఎం సీటు అడిగే బలం జనసేన పార్టీకి ఉండదు. కానీ జనసైనికులు మాత్రం పవనే సీఎం కావాలి పట్టుబట్టి కూర్చున్నారు. ఒకవేళ జనసేన టీడీపీ కూటమి గెలిస్తే.. సీఎం సీటు విషయంలో వివాదం తప్పదు. దీంతో అటు జనసైనికులను కూల్ చేసి.. ఇటు చంద్రబాబుకు సేఫ్ సీట్ ఇచ్చేందుకు పవన్‌కు ఉన్న ఒకేఒక్క దారి అసెంబ్లీ నుంచి తప్పుకుని ఎంపీగా పోటీ చేయడం అనేది కొందరరి వాదన. ఇక మోడీ నుంచి పవన్‌కు మంచి ఆఫర్ ఉందని. ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి పదవి ఇస్తామన్నారని టాక్.
ఏపీలో ఉన్న సిచ్యువేసన్ చూస్తే పవన్ సీఎం అయ్యే చాన్సెస్ చాలా తక్కువ. అదే ఎంపీగా వెళితే కేంద్ర మంత్రి అవ్వడం దాదాపు పక్కా. దీంతో సేఫ్ సైడ్‌లో పవన్ ఎంపీగా పోటీ చేసే అవకాశాలే ఎక్కవగా ఉన్నాయనేది మరికొందరి వాదన. ఇక ఎంపీగా, ఎమ్మెల్యేగా కూడా పవన్ పోటీ చేయబోతున్నారని.. ఆ రెండు కలిసి వచ్చే సెగ్మెంట్‌ను వెతికే ప్రాసెస్‌లోనే తన పోటీ స్థానం ప్రకటించలేదు అనేది ఇంకొందరి వాదన. ఇలా పవన్ మౌనంతో అనేక వాదనలు తెరమీదకు వస్తున్నాయి. ఈ వాదనలు ఎలా ఉన్నా.. పవన్ చేసిన ఈ పనికి జనసైనికులు మాత్రం చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. మరి పవన్ ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.