PAWAN KALYAN: తిరుపతి నుంచి బరిలో దిగుతున్న పవన్ కళ్యాణ్

టీడీపీ-జనసేన మధ్య సీట్ల పంపకాల వ్యవహారం దాదాపు కొలిక్కి వస్తోందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. అదే సమయంలో ఈసారి పవన్‌ కళ్యాణ్‌ ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న ప్రస్తావన కూడా వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

  • Written By:
  • Publish Date - December 20, 2023 / 02:45 PM IST

PAWAN KALYAN: పవన్‌ కళ్యాణ్‌ తిరుపతి నుంచి పోటీ చేయాలని ఫిక్సయ్యారా..? ఇప్పటిదాకా ప్రచారంలో ఉన్నవి కాకుండా.. తిరుపతి సీటు మీద ఆయన మనసు పడ్డారా..? ఆయన చర్యలు ఊహాతీతం అన్న అజ్ఞాతవాసి మూవీ డైలాగ్‌‌నే రియాల్టీలో చూపించాలనుకుంటున్నారా..? అటు తెలుగుదేశానికి, ఇటు తనకు ఉమ్మడిగా ఉపయోగపడేలా పవన్‌ తిరుపతిని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ-జనసేన మధ్య సీట్ల పంపకాల వ్యవహారం దాదాపు కొలిక్కి వస్తోందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. సమాచారం కింది స్థాయిదాకా రాకున్నా.. రెండు పార్టీల అధినేతలు ఈ విషయంలో ఒక క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది.

RAJINI SAICHAND: రేవంత్‌ నాకు బాబాయి అవుతాడు.. బాంబు పేల్చిన సాయిచంద్‌ భార్య రజినీ..

చంద్రబాబు, పవన్‌ తాజా మీటింగ్‌లో ఈ అవగాహన కుదిరిందని అంటున్నారు. అదే సమయంలో ఈసారి పవన్‌ కళ్యాణ్‌ ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న ప్రస్తావన కూడా వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోగా.. ఈసారి కొత్త నియోజకవర్గం పేరు బాగా ప్రచారంలోకి వచ్చింది. ఆ రెండిటితో పాటు పిఠాపురం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాయి జనసేన వర్గాలు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేన బలంగా ఉండటం, ప్రత్యేకించి పిఠాపురం సెగ్మెంట్‌లో కాపు సామాజికవర్గం ఓట్లు అత్యధికంగా ఉండటం లాంటి అనుకూలతల గురించి మాట్లాడుకుంటూ వస్తోంది జనసేన కేడర్‌. రకరకాల చర్చలు, ఊహాగానాలు ఉన్నా ఆ విషయంలో పవన్‌ మాత్రం ఎప్పుడూ స్పందించలేదు. అయితే బాబుతో జరిగిన తాజా భేటీలో ఒక కొత్త ఈక్వేషన్‌ తెర మీదికి వచ్చినట్టు తెలిసింది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎలాగూ జనసేన ప్రాబల్యం ఉంది. టీడీపీకి బలం ఉంది. రెండు పార్టీలు కలిస్తే ఖచ్చితంగా ప్రభావవంతంగా ఉంటుందన్నది అధినేతల ఆలోచన అట. అలాంటప్పుడు పవన్‌ గోదావరి జిల్లాల్లో పోటీ చేయడం వల్ల వచ్చే ఎక్స్‌ట్రా అడ్వాంటేజ్‌ ఉండదు గనుక ఉమ్మడి ప్రత్యర్థి వైసీపీ బలంగా ఉన్న రాయలసీమ మీద ఫోకస్‌ పెట్టాలన్న ప్రతిపాదన వచ్చినట్టు చెప్పుకుంటున్నారు.

Tamil Nadu : జలదిగ్బంధంలో తమిళనాడు.. మరిన్ని హెలికాప్టర్ కావాలి : సీఎం స్టాలిన్
పవన్‌ రాయలసీమ నుంచి పోటీ చేస్తే.. అది రెండు పార్టీలకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారట. ఇప్పటికే కుప్పం నుంచి చంద్రబాబు, హిందూపురం నుంచి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తూన్నారు. ఈ పరిస్థితుల్లో తిరుపతి నుంచి పవన్‌కళ్యాణ్‌ పోటీ చేస్తే అన్ని విధాలా ఉపయోగం అన్న చర్చ వచ్చిందట. తిరుపతి అయితే పవన్‌కు కూడా రిస్క్‌ ఉండదని, గతంలో ఇది ప్రజారాజ్యం గెల్చుకున్న సీటు కాబట్టి ఇబ్బందులు ఉండకపోవచ్చంటున్నారు. తిరుపతి నియోజకవర్గంలో బలిజ సామాజికవర్గం కీలకంగా ఉంటుంది. పవన్‌ బరిలో దిగితే ఆ ఓట్లన్నీ వస్తాయని అంచనా వేస్తున్నట్టు తెలిసింది. గతంలో ప్రజారాజ్యం తరపున చిరంజీవి కూడా తిరుపతి నుంచి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో అంత వైసీపీ హవాలో కూడా ఇక్కడ ఆ పార్టీకి మెజార్టీ చాలా తక్కువ వచ్చింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డికి వచ్చిన మెజార్టీ వందల్లోనే ఉంది. ఈ లెక్కలన్నిటినీ బేరీజు వేసుకుంటే.. పవన్‌ తిరుపతి బరిలో దిగడం ఉత్తమమన్న ప్రతిపాదన తాజాగా తెర మీదికి వచ్చినట్టు తెలిసింది. గత ఎన్నికల్లో రాయలసీమలోని 52 అసెంబ్లీ సీట్లకుగాను టీడీపీ కేవలం మూడు సీట్లను మాత్రమే గెల్చుకోగలిగింది.

Bigg Boss Season 7 Winner : బిగ్‌బాస్‌ విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ మిస్సింగ్‌.. ఫోన్‌ స్విచ్ఛాఫ్‌..

చంద్రబాబు, బాలకృష్ణతోపాటు ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్‌ మాత్రమే అసెంబ్లీలో అడుగుపెట్టగలిగారు. జిల్లాలకు జిల్లాలనే వైసీపీ స్వీప్‌ చేసింది. కర్నూలు, కడపతో పాటు గ్రేటర్‌ రాయలసీమలో భాగమనే నెల్లూరు జిల్లాను సైతం స్వీప్‌ చేసేసింది వైసీపీ. దీంతో ఈసారి ఆ పరిస్థితి రాకుండా ఫోకస్‌ పెంచాలన్న నిర్ణయానికి వచ్చారట బాబు, పవన్‌. సీమలో వైసీపీ బలాన్ని తగ్గించగలిగితే.. మిగతా చోట్ల తమ యావరేజ్‌ పెరుగుతుందన్న వ్యూహం ఉందంటున్నారు పరిశీలకులు. అలాగే నాడు ప్రజారాజ్యం తిరుపతితో పాటు బనగానపల్లె, ఆళ్ళగడ్డ, నెల్లూరు సిటీ స్థానాలను గెల్చుకుంది. ఇప్పుడు పవన్‌ రాయలసీమ బరిలో ఉంటే.. అలాంటి కొన్ని సీట్ల మీద ప్రభావం ఉంటుందన్న లెక్కలున్నట్టు కూడా చెబుతున్నారు. పవన్‌ పోటీ ప్రభావం రాయలసీమతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని చాలా సీట్ల మీద ఉంటుందని టీడీపీ, జనసేన అగ్రనేతల అంచనా. అయితే ఇక్కడ మరో వాదనా ప్రచారంలో ఉంది. రాయలసీమలో పోటీ అన్నది చంద్రబాబు వ్యూహంలో భాగమని, దానికి పవన్‌ కన్విన్స్‌ అవుతారా లేక తాను ముందుగా అనుకున్న సీట్లలో ఎక్కడో ఒక చోట నుంచి పోటీ చేస్తారా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు.