PAWAN KALYAN: తెలంగాణ ఎన్నికల పోరు తారస్థాయికి చేరింది. అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అఫిడవిట్ల పరిశీలన కూడా పూర్తయ్యింది. ఇక మిగిలింది.. తమ హామీలతో ప్రజల ఓట్లు గెలుచుకోవడమే. ఇప్పటికే అన్ని పార్టీలు ఓ రేంజ్‌లో ప్రచారం చేస్తున్నాయి. బీఆర్‌ఎస్ ప్రచారంలో లీడ్‌లో ఉంది. కాంగ్రెస్ కూడా వరుస మీటింగ్‌లతో ప్రచారం హోరెత్తిస్తోంది. ఏ రకంగా చూసినా తెలంగాణలో బీజేపీ వెనకబడి ఉన్నట్టే కనిపిస్తోంది. మొన్నటి వరకూ మంచి జోష్‌లో ఉన్న ఆ పార్టీ.. ఇప్పుడు కాస్త వెనక్కి తగ్గింది.
BANDI SANJAY: నాకు ఏ పదవీ వద్దు.. బీజేపీపై బండి సంజయ్ నెగటివ్ కామెంట్స్..
ఇలాంటి టైంలో ఆ పార్టీలో జోష్ నింపేందుకు జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగబోతున్నారు. తెలంగాణలో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి బీజేపీ 8 టికెట్లు కేటాయించింది. ఈ ఎనిమిది స్థానాల్లో పవన్ ప్రచారం చేయబోతున్నట్టు తెలుస్తోంది. వీలైతే వారాహి యాత్ర కూడా నిర్వహిస్తారని జనసేన వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నెల 22 నుంచి పవన్ కళ్యాణ్ తెలంగాణ షెడ్యూల్ ఉండే చాన్స్ ఉందంటున్నారు జనసేన నేతలు. దీనికి సంబంధించిన రూట్‌మ్యాప్ కూడా ఇప్పటికే సిద్ధం చేసినట్టు సమచారం. దీనిపై పార్టీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రచారానికి పవన్ వస్తున్నారని తెలియడంతో అటు జనసేనతో పాటు ఇటు బీజేపీ నేతల్లో కూడా ఫుల్ జోష్ నిండింది. ఏపీలో తన స్పీచ్‌లతో అధికార పార్టీకి చెమటలు పట్టిస్తున్నారు పవన్ కళ్యాణ్.
ఏపీతో కంపేర్ చేస్తే తెలంగాణలో పరిస్థితులు వేరుగా ఉన్నప్పటికీ.. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అధికార పక్షాన్ని ప్రశ్నించక తప్పదు. దీంతో పవన్ ఇక్కడ ఎలాంటి స్పీచ్‌లు ఇవ్వబోతున్నారు.. తెలంగాణ ప్రభుత్వాన్ని ఎలా నిలదీయబోతున్నారని జనసేన కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్.. తెలంగాణ షెడ్యూల్‌ను జనసేన పార్టీ ఎప్పుడు విడుదల చేస్తుందో చూడాలి.