తిరుమల లడ్డు వ్యవహారం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య యుద్దానికి వేదిక కానుందా…? తమిళనాడు ఉప ముఖ్యమంత్రి స్టాలిన్ పై పవన్ వ్యాఖ్యలు చేసారు అంటూ కేసు పెట్టడం వెనుక కారణం ఏంటీ…? ఇప్పుడు పవన్ కూడా కేసు పెట్టి కౌంటర్ ఇస్తారా…? ఇప్పుడు ఇదే ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో సంచలనం అవుతోంది. ఏం జరుగుతుందో అనే ఉత్కంట అందరిలో పెరిగిపోయింది. వారాహి బహిరంగ సభలో రెండు రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మధురైలో కేసు నమోదు చేసారు.
మతాలను రెచ్చ గొట్టే వ్యాఖ్యాలు చేశారంటూ మదురై న్యాయవాది కేసు పెట్టడంతో పవన్ పై కేసు పెట్టారు. దీనితో తమిళనాడు డిప్యూటీ సిఎం వర్సెస్ ఏపీ డిప్యూటీ సిఎం మధ్య వార్ మొదలయింది అంటూ కథనాలు మొదలయ్యాయి. సనాతన ధర్మం అనేది ఒక వైరస్ దాన్ని నాశనం చేస్తానని ఒక యువనేత అంటున్నాడు… నీలాంటోళ్ళు చాలామంది చరిత్ర లో వచ్చారు పోయారంటూ తిరుపతిలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్ ను ఉద్దేశించి అన్నారని ప్రచారం మొదలయింది తమిళనాట.
దీంతో పవన్ వ్యాఖ్యలపై లెట్స్ వెయిట్ అండ్ సీ అంటూ ఉదయనిధి స్టాలిన్ సమాధానం ఇచ్చారు. ఇప్పటికే పవన్ టార్గెట్ గా పాత విడియోలను, ట్రోల్ చేయడం మొదలుపెట్టింది డిఎంకే సోషియల్ మిడియా వింగ్. ఇక పవన్ కు సపోర్ట్ గా బిజెపి వింగ్ కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టింది. పవన్ కల్యాణ్ పై మదురై పోలీస్ కమిషనర్ కు న్యాయవాది వాంజినాధన్ ఫిర్యాదు చేయడంతో ఐపీసీ 499, 500, 504 మరియు 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. ఇప్పుడు దీనికి కౌంటర్ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నారు.
త్వరలోనే పవన్ కళ్యాణ్ విజయవాడలో లేదా తిరుపతిలో కేసు నమోదు చేసే అవకాశం ఉందని సమాచారం. స్టాలిన్ వైరస్ అంటూ చేసిన వ్యాఖ్యలపై పవన్ కేసు నమోదు చేయిస్తారని తెలుస్తోంది. గతంలో కూడా ఉధయనిది స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఆ వ్యాఖ్యల ఆధారంగా పవన్ ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంది. నాస్తిక కుటుంబానికి చెందిన స్టాలిన్ కాస్త వివాదాస్పద వ్యక్తిగా ఫేమస్ అయ్యారు. ఇక ఉధయనిది స్టాలిన్ కు తమిళనాడులో ఉన్న వైసీపీ కార్యకర్తలు కూడా సపోర్ట్ చేస్తున్నట్టు సమాచారం.
తమిళంలో పోస్ట్ లు పెడుతూ స్టాలిన్ కు మద్దతు ఇస్తున్నారు. దీనితో ఈ కేసు వెనుక వైసీపీ కూడా ఉందేమో అనే అనుమానాలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. వీటికి కౌంటర్ ఇవ్వడానికి తమిళనాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సిద్దమయ్యారు. దీనితో ఇది ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్దానికి కూడా దారి తీసే అవకాశం ఉంది. ఇక తమిళనాడుపై సీరియస్ గా ఉండే… కర్ణాటక వాళ్ళు కూడా కావేరి వివాదాన్ని తెచ్చి స్టాలిన్ ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఇలా ఇప్పుడు ఈ వివాదం ఏ మలుపులు తిరుగుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.