నేను హోం మంత్రి కాదు. లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదు. పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పే మాటలు ఇవి. నేను హోం మంత్రి అయితే పరిస్థితి మరోలా ఉండేది….. హోం మంత్రి అనిత ఏం చేస్తుంది? అంటూ తన ప్రభుత్వం పైనే, తన తోటి మంత్రిపైనే పవన్ విమర్శలు. ఇవి అన్ని చూస్తుంటే … హోంమంత్రి పదవి కోసం పవన్ తహతహలాడుతున్నారా..? హోం మంత్రి అయితే తప్ప అసలు సిసలైన పవర్ చేతిలోకి రాదనుకుంటున్నారా అని అనుమానం చాలామందికి వస్తుంది.
ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ పదేపదే హోం మంత్రి పదవి గురించి కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో చెలరేగిపోతున్న వాళ్ళని అరెస్టులు చేసే విషయంలో, అలాగే రేప్ ల వంటి దుస్సంఘటనలు జరుగుతున్నప్పుడు చర్యలు తీసుకునే విషయంలో హోం మంత్రి అనిత చాలా అలసత్వంతో ఉన్నారని … ఆ శాఖలో ఏం జరుగుతోందని పబ్లిక్ మీటింగ్లో హోంమంత్రిని కడిగిపారేశారు. తన కూతుళ్ళపై చండాలమైన కామెంట్లు పెట్టిన వాళ్లను కూడా పట్టుకోలేని హోం శాఖ ఎందుకంటూ నిలదీశారు. నేను హోమ్ మినిస్టర్ అయి ఉంటే పరిస్థితి మరోలా ఉంటుందంటూ పరోక్షంగా చంద్రబాబు కి, అనిత కి, తన టార్గెట్ చేస్తున్న వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చారు.
పవన్ మాటలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీశాయి. చివరికి చంద్రబాబు సమక్షంలో పవన్, అనిత ఇద్దరి మధ్య రాజీ కుదిరింది.
పవన్ సలహాలు సూచనలు స్వీకరిస్తానని స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా అనిత ఈ వివాదానికి తెర దించారు. సోషల్ మీడియాలో అగ్లీ పోస్టులు పెట్టిన వాళ్ళని, జగన్ హయాంలో చెలరేగిపోయిన సోషల్ మీడియా వారియర్స్ ని చకచకా అరెస్టులు చేసి లోపల వేశారు.
కానీ ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ హోం శాఖ ప్రస్తావన చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో నేరాలకు సంబంధించి ఎవరేమి అడిగినా… లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదు, నేను హోం మంత్రిని కాను అనే డైలాగు పవన్ నుంచి వస్తూనే ఉంది. రాంగోపాల్ వర్మ ని ఎందుకు ఇంకా అరెస్టు చేయలేకపోయారు అని అడిగితే ,సీఎం ని అడిగి చెప్తాను… ఆయన దృష్టికి తీసుకెళ్తాను అని అనడం ద్వారా నేను వేరు…. ప్రభుత్వం వేరు… అనే విషయాన్ని పవన్ చెప్పాలనుకుంటున్నారా… అని చాలామంది భావిస్తున్నారు
హోం మంత్రి పదవిపై పవన్ కు మొదటి నుంచి ఆసక్తి ఉంది. ముఖ్యమంత్రి తర్వాత హోం మంత్రి కే ప్రభుత్వంలో ప్రాధాన్యం ఉంటుంది. అంతా ముఖ్యమైన శాఖను అనిత లాంటి వాళ్ళకి ఇచ్చి పరోక్షంగా చంద్రబాబు, లోకేష్ ఆ శాఖను నడుపుతున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. అనితకు హోం శాఖ పై పట్టు లేదని ఒక డమ్మీ మంత్రిగా మాత్రమే ఉన్నారని, ఆ శాఖను పూర్తిగా అదుపులో పెట్టుకున్నది లోకేష్ అనేది…. ప్రభుత్వం లోపల ,బయట వినిపిస్తున్న మాట. ఇది పవన్ కు కాస్త ఇబ్బంది కలిగిస్తున్న విషయం. అందుకే పదే పదే నేను హోం మంత్రిని అయితే పరిస్థితి మరోలా ఉంటుందంటూ బహిరంగంగానే మాట్లాడుతున్నారు. అన్నిటికీ మించి హోం శాఖలో విపరీతమైన అవినీతి జరుగుతోందని…. ఇటీవల ఎస్సైలు, సీఐలు, డీఎస్పీలు బదిలీల్లో లక్షలు ,కోట్లు చేతులు మారాయని విమర్శలు వచ్చాయి.
హోం శాఖ ఆచేతనంగా ఉండడం, అవినీతి ఆరోపణలు రావడం చూసి అసలు ఆ శాఖ తన చేతిలో ఉంటే రాష్ట్రంపై కంట్రోల్ ఉంటుంది కదా అనే భావంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. అందుకే పదే పదే ఆ విషయాన్ని చంద్రబాబు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు అనిత ఆ పదవికి సరిపోదని, చాన్నాళ్లుగా , గత ప్రభుత్వాల్లో హోం మంత్రిగా సత్తా లేని వాళ్ళని పెట్టి వెనక ఉండి కొందరు చక్రం తిప్పుతున్నారనే విమర్శకు చెక్ పెట్టాలని కూడా పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లున్నది.