ఎస్పీని ప్రూఫ్స్ తో బుక్ చేసిన పవన్… మినిట్స్ లో ట్రాన్స్ఫర్ చేసిన సీఎం

బుధవారం కేబినేట్ సమావేశం అనంతరం పోలీస్ శాఖలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న హర్షవర్ధన్ రాజు బదిలీ చేస్తున్నట్టు ఓ వార్త బయటకు వచ్చింది. ఆ వార్త బయటకు వచ్చిన కాసేపటికి ఓ జీవో కూడా రిలీజ్ అయింది.

  • Written By:
  • Publish Date - November 7, 2024 / 01:25 PM IST

బుధవారం కేబినేట్ సమావేశం అనంతరం పోలీస్ శాఖలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న హర్షవర్ధన్ రాజు బదిలీ చేస్తున్నట్టు ఓ వార్త బయటకు వచ్చింది. ఆ వార్త బయటకు వచ్చిన కాసేపటికి ఓ జీవో కూడా రిలీజ్ అయింది. హర్షవర్ధన్ రాజు… మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని… వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీగా… అనంతపురం జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న వాసన విద్యా సాగర్ నాయుడుకి అదనపు భాద్యతలు అప్పగిస్తున్నామని సిఎస్ నిరబ్ కుమార్ ప్రసాద్ జీవో రిలీజ్ చేసారు.

జీవో రిలీజ్ కంటే ముందు వచ్చిన వార్త పూర్తి సారాంశం ఏంటో తెలుసా…? “వైఎస్ భారతి పిఏ, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త… వర్రా రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసుల యత్నం, పోలీసుల రాక గమనించి పారిపోయిన వర్రా రవీంద్ర రెడ్డి, రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా అతనికి సహకరించారు అనే కారణంతో ఎస్పీని సిఐని బదిలీ చేస్తున్నారని”… ఆ వార్త తర్వాత మరో వార్త ఒకటి బయటకు వచ్చింది “నిన్న అంటే మంగళవారం వర్రా రవీంద్ర రెడ్డిని అదుపులోకి తీసుకుని తెల్లవారుజామున 41ఏ నోటీసు ఇచ్చి రవీందర్ రెడ్డిని వదిలేసిన కడప పోలీసులు.

మరో కేసులో వర్రా రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు వెళ్లిన పోలీసులు, పోలీసుల రాక గమనించి పారిపోయిన వర్రా రవీందర్ రెడ్డి. చంద్రబాబు, పవన్, లోకేష్, అనితపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డి. అసభ్యకర పోస్టుల దృష్ట్యా రవీందర్ రెడ్డిపై కడప తాలూకా పీఎస్ లో కేసు. రవీందర్ రెడ్డి స్నేహితుడు మహేశ్వర్ రెడ్డిని రాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు. వర్రా ఆచూకీ కోసం ఆయన భార్యను కడప తీసుకెళ్తున్న పోలీసులు. కడప ఎస్పీ ఆఫీసుకు చేరుకున్న కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్.

వర్రా రవీందర్ రెడ్డి కేసుపై ఎస్పీ హర్షవర్థన్ రాజుతో సమావేశమైన డీఐజీ. వర్రా రవీందర్ రెడ్డి కేసుపై ఆరా తీస్తున్న డీఐజీ కోయ ప్రవీణ్. ఓ పక్కన కోయ ప్రవీణ్ ఆరా తీస్తూనే ఉన్నారు, ఎస్పీని బదిలీ చేసేస్తున్నారని న్యూస్ వచ్చేసింది. ఎస్పీ… వైసీపీ నేతలకు సహకరిస్తున్నారనే కారణంతో ఆయన్ను బదిలీ చేసారు. వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసినా 41 ఏ నోటీసులు ఇచ్చి వదిలేసారు. అందుకే ఎస్పీపై చర్యలు తీసుకున్నారు. ఇక్కడి వరకు ఓకే గాని… ఇంత వేగంగా చర్యలు తీసుకోవడానికి కారణం ఏంటీ అనేది చాలా మందికి క్లారిటీ లేదు.

మీడియాలో పోలీసు వర్గాల్లో, ప్రభుత్వ వర్గాల్లో ఈ వార్త ఇప్పుడు ఓ సంచలనం. వైసీపీ కార్యకర్త గురించి ఎస్పీని బదిలీ చేయడం అంటే సిల్లీ విషయం కాదు. అసలు ఆ వర్రా రవీంద్రా రెడ్డి అనే వ్యక్తి కూడా సిల్లీ పర్సన్ కాదు. గత అయిదేళ్లుగా అతని పోస్ట్ లు అత్యంత అభ్యంతరకరంగా ఉన్నాయని, భారతి రెడ్డికి పిఏగా ఉంటూ అతను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబాల్లో మహిళలను అభ్యంతరకంగా మాట్లాడుతున్నాడని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అయినా సరే అతన్ని అరెస్ట్ చేయడం లేదని వారిలో కోపం ఉంది.

అతని అరెస్ట్ గురించి మంగళవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కూడా మాట్లాడి పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. వర్రాతో పాటుగా కల్లి నాగిరెడ్డి, కళ్ళం హరికృష్ణా రెడ్డి, బోడె వెంకటేష్, మేకా వెంకట్రామి రెడ్డిలను అరెస్ట్ చేయాలని పవన్ ఆదేశించారు. అలాగే పంచ్ ప్రభాకర్ పై విజయవాడలో కేసు కూడా నమోదు చేసారు. అయితే అరెస్ట్ చేసినా వర్రాను వదిలేసారు… దానికి కారణం ఎస్పీ… ఈ విషయాన్ని కేబినేట్ మీటింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుకు పూర్తిగా వివరించారు. అంతే… వెంటనే ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసేసారు సీఎం. ఓ పార్టీ కార్యకర్త గురించి ఐపిఎస్ అధికారిని బదిలీ చేయడం అనేది గతంలో జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదు ఏమో… ఇకనైనా ఏపీలో పోలీసులు మారతారో లేదో అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.