రాజకీయాల్లో లాజిక్‌లు కాదు కావాల్సింది.. ప్రజలను తమవైపు తప్పుకునే మ్యాజిక్‌లు తెలిసుండాలి. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కి ఈ విషయం తెలియనట్టుంది. ఈ మధ్య ప్రజలను కలుపుకుపోవడం మానేసి కెలుక్కుంటూ పోవడం మొదలు పెట్టారు. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులపై విమర్శలు చేస్తూ వాళ్ల ఓట్లను, వాళ్ల కుటుంబాలను ఓట్లను దూరం చేసుకున్న పవన్ తాజాగా తణుకు బహిరంగా సభలో చేసిన వ్యాఖ్యలతో ముస్లింలు, క్రిస్టియన్ల ఓట్లను దూరం చేసుకున్నారు. ఇదేమైనా నార్త్ బెల్టా హిందూవులు, ముస్లింలు అంటూ రెచ్చగొట్టనికి..? ధర్మం అంటూ కాషాయ కండువా కప్పుకున్న కరుడుకట్టిన బీజేపీ నేతలాగా పవన్ ప్రసంగం సాగాటాన్ని మొదటి నుంచి ఆయన్ను అభిమానిస్తూ వస్తున్న వాళ్లు వ్యతిరేకిస్తున్నారు. బయటకు చెప్పకున్నా ఇన్నర్ ఫీలింగ్ మాత్రమే అదే…!
జగన్ క్రిస్టియన్ అని అరిస్తే ఏం లాభం?:
ముస్లింలను చూపించో.. క్రిస్టియన్లను చూపించో ఓట్లు తెచ్చుకోవడానికి ఇదేం ఉత్తర ప్రదేశో, ఉత్తరాఖాండో కాదు..కనీసం కర్ణాటక కూడా కాదు. పవన్ రాజకీయం చేస్తుంది ఏపీలో. ఇక్కడ అంతా కులాలపైనే గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. జగన్ హయాంలో 219 ఆలయాలపై దుర్ఘటనలు జరిగాయని తణుకు సభలో పవన్ ఆరోపించారు. పురోహితులను వేలం పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని తెలుసా అన్ని ప్రశ్నించిన పవన్.. వేలం వేయడానికి రాజ్యాంగపరమైన హక్కు ఉందా అంటూ నిలదీశారు. అంతటితో పవన్ ఆగిపోయి ఉంటే బాగుండేది. ప్రజలు కూడా ఆలోచించేవాళ్లు. కానీ పవన్ మధ్యలో ముస్లింలను, క్రిస్టియన్లను తీసుకొచ్చారు. హిందూ ధర్మానికేనా? ఇతర మతాలకు అలాగే చేస్తారా అంటూ ఆవేశ పడ్డ పవన్ మైనారిటీ ఓట్లను దూరం చేసుకుంటున్నారు.
నిజానికి ముస్లింలు, క్రిస్టియన్లు జగన్‌వైపే ఉన్నారు. వాళ్ల ఓట్లు ఎలాగో రావని డిసైడ్ అయ్యారో ఏమో నోటికివచ్చిన విధంగా, బీజేపీ నేతలు ఆవహించినట్టుగా హిందూ ధర్మం జోలికొస్తే ఊరుకోనంటూ జగన్‌పై ఫైర్ అయ్యారు పవన్. ఇక్కడ జగన్ క్రిస్టియన్ అని చెప్పే ప్రయత్నం చేశారు. గతంలోనూ జగన్ క్రిస్టియన్ అని.. ముస్లింలందరూ తనవైపు రావాలంటూ కామెంట్స్ చేశారు పవన్. ఇలా తనవైపు రావాలని ఓవైపు అడుగుతూ మరోవైపు అనవసరమైన విషయాల్లో వాళ్లను లాగడమేంటో జనసైనికులకు కూడా అంతుబట్టడం లేదు. అసలు పవన్‌కు స్క్రిప్ట్ ఎవరూ రాస్తున్నారంటూ ఎగతాళి చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. గెలవాలంటే కేవలం హిందూల ఓట్లతోనే గెలవలేరు..ఎందుకంటే రెచ్చగొట్టగానే రెచ్చిపోవడానికి ఏపీ ప్రజలకు మతంపై అంత ఇంట్రెస్టూ ఉండదు. ఈ మధ్య పవన్ పుణ్యామా అని కాస్త పెరిగిన మాట వాస్తవమే అయినా..మతం కోసం తన్నుకోవడం..కొట్టుకోవడం..విద్వేషాలు రగిలించడం తెలియని అమాయకులు ఏపీ ఓటర్లు. ఈ మతాల స్ట్రాటజీ ఏపీలో వర్క్ అవుట్ అవ్వదు. ఇక పవన్ ప్రసంగాలు చూస్తుంటే కాపుల ఓట్లను తనవైపు తిప్పుకోవడంపై పెట్టిన శ్రద్ధ మిగిలిన కులాలు, మతాలపై పెట్టడం లేదన్నది అర్థమవుతుంది. ఇది ఇలానే కొనసాగితే చంద్రబాబుకు కూడా నష్టం తప్పదు. ఎందుకంటే ఎన్నికల సమయానికి జనసేన-టీడీపీ-బీజేపీ పొత్తు ఉంటుందన్నది అందరికి తెలిసిన విషయమే..ఇలా ఇతర మతస్థులను కెలికితే మెజారిటీ హిందూవుల ఓట్లు పడతాయనుకోవడం పెద్ద భ్రమ..!