జనసేన అధినేత, ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్… అప్పుడపుడు మాట్లాడినా ఆ మాటలకు, విమర్శలకు ఉండే వెయిట్ ఎక్కువ. ఒకరిని ఎయిమ్ చేసి పవన్ మాట్లాడితే మీడియాలో ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. జనసేన అధినేతగా ఉన్నప్పుడు ఇలాంటి సంచలనాలు ఎన్నో. ఇప్పుడు పవన్ రేర్ గా మాట్లాడుతున్నారు. కానీ ప్రతీ ఒక్కటి దుమ్ము రేపుతోంది. రీసెంట్ గా లా అండ్ ఆర్డర్ విషయంలో స్వయంగా తన తోటి మంత్రి… హోం మంత్రి అనిత లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ఆరోపణలు తీవ్ర స్థాయిలో చేసారు.
అవసరమైతే తాను హోం శాఖ తీసుకుంటాను అంటూ పవన్ ఘాటు కామెంట్స్ చేసారు. ఇప్పటి వరకు కూడా పవన్ అసలు అలా ఎందుకు మాట్లాడి ఉంటారు అనేది చాలా మందికి క్లారిటీ లేదు. కాని పవన్ ఇక్కడ పక్కాగా మైండ్ గేమ్ ఆడారు అనేది స్లో గా జనాలకు అర్ధమవుతోంది. ఎస్ పవన్ మైండ్ గేమ్ ఆడారు. దానికి కారణం ఓ ఇద్దరు వైసీపీ సోషల్ మీడియాలో ఉన్మాదులుగా ప్రవర్తించే వారు. పవన్ కళ్యాణ్ విషయంలో కొందరు వైసీపీ కార్యకర్తలు పదే పదే కొన్ని విమర్శలు చేసేవారు. అవి అత్యంత అభ్యంతరకరంగా ఉండేవి.
వైసీపీ హయాంలో వారితో విమర్శలు చేయించేవారు అగ్ర నేతలు అనే ఆరోపణలు ఉన్నాయి. కాని ఆ ఇద్దరినీ ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం లేదు. అసలు విషయంలోకి వెళ్తే… పవన్ కుమార్తెలను, భార్యలను టార్గెట్ చేసి మాట్లాడటమే కాదు వారిని రేప్ చేస్తా అంటూ కూడా మాట్లాడాడు బోరుగడ్డ అనీల్ కుమార్ అనే రౌడీ షీటర్. అతని విషయంలో పోలీసుల చర్యలు, ప్రభుత్వం చర్యల కోసం పవన్ నాలుగు నెలల నుంచి ఎదురు చూస్తూ వచ్చారు. కాని అరెస్ట్ మాత్రం జరగలేదు… అతన్ని అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నం చేసినా… అతను ఢిల్లీ పారిపోవడంతో కష్టమైంది.
ఇక అతను వచ్చిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అతని అరెస్ట్ జరిగిన కొన్ని రోజులకు పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మాట్లాడారు. అతని విషయంలో పోలీసులు సేవలు చేసే విధంగా వైఖరి ఉండటం ఒకటి అయితే… మిగిలిన వైసీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకోకపోవడం. అందులో ముఖ్యంగా వర్రా రవీంద్రా రెడ్డి, ఇంటూరి రవి కిరణ్. ఈ ఇద్దరూ అత్యంత దారుణంగా సోషల్ మీడియాలో పవన్ ను విమర్శించారు. ఈ ఇద్దరి భాష కూడా అత్యంత అభ్యంతరకరంగా ఉండేది. ఈ ఇద్దరి అరెస్ట్ విషయంలో చాలా జాప్యం జరుగుతూ వచ్చింది.
ఒకటి రెండు సార్లు వారిని అరెస్ట్ చేసినా సరే 41 ఏ నోటీసులు ఇచ్చి పోలీసులు వదిలేసారు. పవన్ వ్యాఖ్యల తర్వాత కూడా వర్రాకు అలాగే నోటీసులు ఇచ్చి పంపారు. అది భరించలేని పవన్… చంద్రబాబుకు నేరుగా ఫిర్యాదు చేసారు. దీనితో ఎస్పీని బదిలీ చేయడం, ఇతర పోలీసులను సస్పెండ్ చేయడం జరిగింది. ఇక పోలీసుల చర్యలతో పవన్ ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అందుకే ఇటీవల, అటవీ అమరవీరుల సంస్మరణ వేడుకల్లో పవన్ మాట్లాడుతూ… నా బిడ్డలను, భార్యను రేప్ చేస్తా అన్న వాడిని చూసి చూడనట్టు వదిలేయాలా అని నిలదీశారు.
దీని బట్టి చూస్తే.. వైసీపీ కార్యకర్తల అరెస్ట్ కోసం ఎదురు చూసిన పవన్… అది జరగకపోవడంతో మైండ్ గేమ్ ఆడారని, కావాలనే విమర్శలు చేసారనే ఒపీనియన్ వినపడుతోంది. ఆ వ్యాఖ్యల తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి… హోం మంత్రి అమిత్ షాకు వివరణ కూడా ఇచ్చారు. ఇక అక్కడి నుంచి వైసీపీ కార్యకర్తల అరెస్ట్ లు వేగం అందుకున్నాయి. ఇన్నాళ్ళు చూసి చూడనట్టు ఊరుకున్న పోలీసులు… వారి కోసం వేటాడుతున్నారు. పోలీసులకు కూడా పవన్ నైతిక మద్దతు ఇస్తున్నారు. మీ జోలికి వస్తే నేను తాట తీస్తా అంటూ పోలీసులకు సపోర్ట్ గా మాట్లాడారు. అందుకే పోలీసులు కూడా దూకుడు పెంచి తమ పని తాము చేయడం మొదలుపెట్టారనే కామెంట్స్ వస్తున్నాయి.