PITHAPURAM: పిఠాపురంలో పోటీ చేస్తానని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించిన మరుక్షణమే పిఠాపురంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది వైసీపీ. ఎలాగైనా పవన్‌ను ఓడించాలన్న లక్ష్యంతో స్పెషల్ ఆపరేషన్ మొదలుపెట్టారు అధికార పార్టీ నేతలు. వైసీపీ రీజినల్ ఇంఛార్జ్ మిధున్ రెడ్డి పిఠాపురంలో దిగిపోయారు. నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీ మీద దృష్టి పెట్టారు. ఆ ఏరియాలో తమకు కలసి వచ్చేవాళ్ళు ఎవరో ఎంక్వైరీ చేస్తున్నారు.
MLC KAVITHA: ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ సోదాలు..
ప్రతి గ్రామం పరిధిలోని పోలింగ్ బూత్‌కి సంబంధించి పోల్ మేనేజ్‌మెంట్‌పై ఫోకస్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ పోటీకి నిరసనగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరులు ఆందోళన చేశారు. టీడీపీ ఆఫీసులో జెండాలు పీకి తగలబెట్టారు. అయితే వర్మను తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేయడంతో.. ఆయన్ని వైసీపీలోకి చేర్చుకోవడంపై దృష్టి పెట్టారు ఆ పార్టీ సీనియర్ నేత మిథున్ రెడ్డి. పిఠాపురంలో ఇలాంటి అసంతృప్త నాయకులపై వైసీపీ ఫోకస్ చేసింది. టీడీపీ, జనసేన నుంచి వచ్చే లీడర్లను ఆకర్షించేందుకు మిథున్ రెడ్డి ప్రత్యేకంగా టీమ్‌ను ఏర్పాటు చేశారు. పిఠాపురంలో కాపు సామాజికవర్గం ఓట్లు 91 వేలకు పైగా ఉన్నాయి. కాపుల్లో మెజారిటీ వర్గం పవన్‌కే సపోర్ట్ చేయనుంది. అందుకోసం వైసీపీలో జాయిన్ అయిన ముద్రగడ పద్మనాభం పలుకుబడిని ఉపయోగించుకోవాలని ప్లాన్ చేశారు. పిఠాపురంలో ఉన్న మాలలతో పాటు శెట్టి బలిజలు, చేనేత కార్మికులు, బెస్తలను తమకు వైపునకు తిప్పుకునే ప్లాన్ చేస్తోంది వైసీపీ. ఆయా వర్గాలకు చెందిన నేతలతో మంతనాలు మొదలుపెట్టారు. పిఠాపురంనకు వంగా గీతను వైసీపీ ఇంఛార్జ్‌గా ప్రకటించింది.
అయితే, ఆమెను కాకినాడ పార్లమెంట్ పరిధిలోని మరో అసెంబ్లీ నియోజకవర్గానికి కేటాయించే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు. ఇక్కడ ముద్రగడ పద్మనాభం కుటుంబం నుంచి ఒకర్ని దింపాలన్న ఆలోచన వైసీపీ పెద్దలు చేస్తున్నారు. గతంలో వర్మ ఇక్కడ గెలిచినందున ఆయనకు టిక్కెట్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. పిఠాపురంలో సీఎం జగన్ స్వయంగా ప్రచారం చేయాలని డిసైడ్ అయ్యారు. కొందరు వైసీపీ ముఖ్య నేతలను క్యాంపెయిన్‌కి దించాలని భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ను ఓడిస్తే.. జనసేనాని రాజకీయ భవిష్యత్తుకు ఎండ్ కార్డ్ పడుతుందని జగన్ ప్లానేస్తున్నారు.