PITHAPURAM: జనసేన అధినేత పవన్.. పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు. పదేళ్లు రాజకీయంలో ఉన్నా.. పవన్ ఇంత వరకు చట్టసభల్లో అడుగు పెట్టలేదు. గత ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేసి.. ఓడిపోయారు. దీంతో ఈసారి తను గెలవడమే కాదు. అధికారంలోకి రావాలని పవన్ డిసైడ్ అయ్యారు. పవన్ పిఠాపురం నుంచి పోటీకి దిగుతుండడంతో.. ఇప్పుడీ నియోజకవర్గం మీదే ఏపీ జనాల దృష్టి ప్రధానంగా కనిపిస్తోంది. పవన్ టార్గెట్‌గా వైసీపీ ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేస్తోంది.
PADMA RAO: కిషన్ రెడ్డికి పోటీగా పజ్జన్న.. లష్కర్‌పై గురిపెట్టిన బీఆర్ఎస్
పవన్ నుంచి ఇలా ప్రకటన వచ్చిందో లేదో.. ఎంపీ పెద్దిరెడ్డికి, అతడి తనయుడు మిథున్‌రెడ్డికి పిఠాపురం బాధ్యతలు అప్పగించింది. ఇక అటు పవన్ పోటీ చేస్తుండటంతో.. టీడీపీ శ్రేణుల్లో అంతో ఇంతో ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని అధికార పార్టీ పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో పిఠాపురం నుంచి దొరబాబు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యే పోటీ చేస్తుండటంతో.. జగన్ ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పవన్ మీద మహిళను రంగంలోకి దింపి తానేంటో నిరూపించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను రంగంలోకి దింపుతున్నారు. పిఠాపురం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దొరబాబును ప్రస్తుతానికి పక్కన బెట్టేశారు. అయితే వ్యతిరేకత రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. నియోజకవర్గంలో అసమ్మతి వినిపించకుండా చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఎమ్మెల్యే దొరబాబును బుజ్జగించి వంగా గీతకు సహకరించేలా కసరత్తులు చేపట్టారు. ఇక అటు టీడీపీ తరఫున టికెట్ ఆశించిన వర్మ.. ప్రస్తుతం కూల్ అయినట్లే కనిపిస్తున్నా.. ఆయన చేస్తున్న కామెంట్లు మరింత ఆసక్తిగా మారుతున్నాయ్.
పవన్ కాకినాడ ఎంపీగా పోతే.. పిఠాపురంలో తానే పోటీ చేస్తానంటూ వర్మ ఇచ్చిన తికమక స్టేట్‌మెంట్.. అక్కడి రాజకీయాల్లో మరిన్ని సెగలు పుట్టిస్తున్నాయ్. ఇక అటు పవన్ విషయంలో వైసీపీ కొత్త స్కెచ్ తెరమీదకు తీసుకొచ్చింది. పిఠాపురం జనాలకు పవన్ అందుబాటులో ఉండరని.. నాన్ లోకల్ అంటూ వైసీపీ కొత్త ప్రచారాన్ని అందుకుంది. ఇదంతా ఎలా ఉన్నా.. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి మీద ప్రశంసలు గుప్పిస్తూ పవన్ చేసిన కామెంట్ల మీద రకరకాల చర్చ జరుగుతోంది. సేనాని కన్ఫ్యూజన్‌లో పడ్డాడని కొందరు.. లేదు కన్ఫ్యూజ్ చేస్తున్నారని మరికొందరు.. పిఠాపురం రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామం చూస్తామంటూ ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.