పిఠాపురం వర్మ సంచలన నిర్ణయం.. పవన్‌కు భారీ షాక్‌!

పాలిటిక్స్‌లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు. ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది రాజకీయం. అలా ఉంటుంది కాబట్టే అదే రాజకీయం అవుతుంది. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.. డిప్యూటీ సీఎం తాలూకా, పవన్ అడ్డా పిఠాపురంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. ఇలాంటి మాటలే వస్తాయ్ ఎవరికైనా

  • Written By:
  • Publish Date - September 10, 2024 / 12:34 PM IST

పాలిటిక్స్‌లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు. ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది రాజకీయం. అలా ఉంటుంది కాబట్టే అదే రాజకీయం అవుతుంది. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.. డిప్యూటీ సీఎం తాలూకా, పవన్ అడ్డా పిఠాపురంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. ఇలాంటి మాటలే వస్తాయ్ ఎవరికైనా ! కూటమి అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే.. ఎన్ని మలుపులు తిరగాలో అన్ని మలుపులు తిరిగింది పిఠాపురం రాజకీయం. టీడీపీ, జనసేన మధ్య.. దూరం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. టీడీపీని జనసేన స్థానిక నేతలు దూరం పెడుతుంటే.. టీడీపీ నేతలు కూడా జనసేన లోకల్ లీడర్స్‌ను బాయ్ కాట్ చేశారు.

అధికారంలోకి కూటమి వచ్చి వంద రోజులు కాకముందే.. పిఠాపురంలో టీడీపీ, జనసేన ఫైట్ పీక్స్‌కు చేరుకుంది. అధినాయకత్వం మాత్రం బాగానే ఉన్నా.. నియోజకవర్గంలో మాత్రం నేతలు రెండు చీలిపోయారు. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేయడంతో.. స్థానిక టీడీపీ నేత వర్మ తన సీటును త్యాగం చేశారు. పవన్ విజయం కోసం చాలా కష్టపడ్డారు కూడా ! పవన్ పిఠాపురం రాకపోయినా.. ఆయన గెలుపు కోసం ప్రచారం చేశారు. ఇక పవన్ కూడా.. తన గెలుపును వర్మ చేతుల్లోనే పెడుతున్నానని ఎన్నికల టైమ్‌లో భారీ డైలాగ్‌లు వేశారు. కట్ చేస్తే.. గెలిచిన తర్వాత ఎక్కడ కూడా వర్మ పేరును పవన్ కనీసం ప్రస్తావించడం లేదని.. వర్మ అనుచరులు ఫైర్ అవుతున్నారు. ఇక అటు వర్మపై జనసేన కార్యకర్తలు దాడి చేయడం మరింత సంచలనం రేపింది.

వర్మ త్యాగానికి ఇలాంటి ప్రతిఫలం ఇస్తారా అంటూ.. ఆయన అనుచరులు, టీడీపీ నేతలు గుర్రుమంటున్నారు. వర్మకు అన్యాయం జరుగుతోందని ఇప్పటికే చాలాసార్లు బహిరంగంగానే అసంతృప్తిని వినిపించారు. ఇక అటు కాకినాడ జనసేన ఎంపీతోనూ వర్మకు దూరం పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. ఇక అటు వర్మను అధికారిక కార్యక్రమాలకు దూరం పెడుతున్నారని.. పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని.. ఆయన మద్దతుదారులు ఫైర్ అవుతున్నారు. దీంతో వర్మ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. వర్మకు ఎమ్మెల్సీగా చాన్స్ ఇస్తామని చంద్రబాబు గతంలో ప్రకటించారు. సాధ్యమైనంత తర్వగా ఆ ఎమ్మెల్సీ పదవి తీసుకుని నియోజకవర్గంలో తన పవర్ చూపించాలని వర్మ భావిస్తున్నారట. దీంతో జనసేనకు నియోజకవర్గంలో చెక్ పెట్టాలనే ఆలోచనలో వర్మ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక అటు మాజీ ఎమ్మెల్యే దొరబాబు ప్రస్తుతం జనసేనలో చేరారు. ఇలాంటి పరిణామాల మధ్య జనసేన జోరుకు బ్రేకులు వేయాలని వర్మ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. .