PM MODI VS REVANTH: మీరు పెద్దన్న లాంటోరు.. మీరు ఒక్క మాట చెప్పారంటే.. అంటూ ప్రధాని మోడీని ఓ విషయంలో రిక్వెస్ట్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. చాలా యేళ్ళ తరువాత మోడీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక స్వాగతం లభించింది. ఆదిలాబాద్‌లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో మోడీతో పాటు సీఎం రేవంత్ కూడా పాల్గొన్నారు. ఒకే వేదికపై ఇద్దరూ మాట్లాడుకోవడం.. వాళ్ళేం మాట్లాడుతున్నారో.. చెవులు రిక్కించి గవర్నర్ తమిళిసై వినడం ఇవాళ్టి హాట్ టాపిక్. అధికారిక కార్యక్రమం వరకూ ఓకే.
PM MODI: బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ కుమ్మక్కు.. కుటుంబ పార్టీల్ని నమ్మొద్దు: ప్రధాని మోదీ
ఆ తర్వాత ఆదిలాబాద్ సభలో రేవంత్‌ను మోడీ ఏసుకోవడమే ఇక్కడ కొసమెరుపు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి ఆదిలాబాద్ వచ్చిన ప్రధాని మోడీకి గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా కాలంగా మోడీకి స్వాగతం చెప్పే అలవాటును మానేశారు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ప్రోటోకాల్ పాటించారు. ఆదిలాబాద్ సభలో ప్రధాని మోడీకి ఓవైపు గవర్నర్ తమిళిసై.. మరోవైపు రేవంత్ కూర్చున్నారు. వేదికపై మోడీ, రేవంత్ పదేపదే మాట్లాడుకోవడంతో.. అసలేం మాట్లాడుకున్నారన్న చర్చ నడుస్తోంది. పార్టీ వేరయినా రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోడీ సాయం కావాలన్న ధోరణి రేవంత్‌లో కనిపిస్తోంది. ప్రధాని మోడీ రాకను 4 కోట్ల మంది ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రం, రాష్ట్రం మధ్య మంచి సంబంధాలు ఉండాలని, గొడవలు పెట్టుకుంటే ఒరిగేదేమీ లేదన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలని, ఆ తర్వాత అందరం కలసి జనం కోసం పనిచేయాలని, అభివృద్ధిలో రాష్ట్రానికి మోడీ పెద్దన్నలాగా ఉన్నారని చెప్పారు రేవంత్.
REVANTH REDDY: కేంద్రంతో వైరం రాష్ట్రాభివృద్ధికి ఆటంకం.. పెద్దన్నలా మోదీ సహకరించాలి: సీఎం రేవంత్
ఈ సభలో మోడీకి కొన్ని రిక్వెస్టులు పెట్టారు సీఎం. తెలంగాణలో గత ప్రభుత్వ నిర్ణయాలతో విద్యుదుత్పత్తిలో వెనకబడ్డాం.. విభజన చట్టంలో చెప్పినట్టుగా ఇంకో 2 వేల 400 మెగావాట్ల పవర్ జనరేషన్‌కు కేంద్రం బాకీ ఉందని గుర్తుచేశారు. తమ్మిడిహట్టి దగ్గర సాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణానికి మహారాష్ట్ర నుంచి 18 వందల 50 ఎకరాల భూమి ఇప్పించాలని, ప్రధాని ఒక్కమాట చెబితే మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందని రిక్వెస్ట్ చేశారు రేవంత్. అధికారిక కార్యక్రమం వరకూ ఓకే. మోడీ, రేవంత్.. ఇద్దరూ స్టేజీ మీద బాగానే కనిపించారు. ఆ తర్వాత ప్రధాని మోడీ.. ఆదిలాబాద్‌లో బీజేపీ మీటింగ్‌లో మాట్లాడారు. అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓ రేంజ్‌లో ఏసుకున్నారు. “BRS ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగింది. ఈ ప్రాజెక్ట్ విషయంలో BRSతో కాంగ్రెస్ కుమ్మక్కు అవుతోంది. గతంలో మీరు తిన్నారు. ఇప్పుడు మేం తింటాం అన్నట్టుగా కాంగ్రెస్ పరిస్థితి ఉంద”ని మోడీ సెటైర్లు వేశారు.
బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చినా.. పాలనలో ఎలాంటి మార్పు లేదంటూ రేవంత్ రెడ్డి సర్కార్ పై విమర్శలు చేశారు ప్రధాని మోడీ. తాను మాత్రం ప్రతిక్షణం ప్రజల కోసమే పనిచేస్తాననీ.. నా ఇంటిని వదిలిపెట్టి.. ఓ లక్ష్యం కోసం బయల్దేరా అన్నారు మోడీ. అభివృద్ధిలో కలసి పనిచేద్దామంటూనే.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు మాత్రం మానలేదు మోడీ.
https://youtu.be/HuE3ODOoJVM