PM MODI: మణిపూర్ అంశంపై చర్చ, అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ గురువారం సాయంత్రం లోక్‌సభలో ప్రసంగించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ తన ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకున్నారు. అవిశ్వాస తీర్మానంపై సభను ప్రధాని పూర్తిగా మిస్ లీడ్ చేశారు. స్పీచ్ ఆసాంతం కాంగ్రెస్‌పై దాడిగా సాగింది. ఇండియా కూటమిపై మోడీకి భయం పట్టుకున్నట్లు కనిపించింది. విపక్షాలు పదే పదే మోడీని టార్గెట్ చేస్తే, ఇండియా కూటమిని ప్రధాని టార్గెట్ చేశారు.
మళ్లీ అధికారంలోకి వస్తామని మేకపోతు గాంభీర్యాన్ని సభలో ప్రదర్శించే ప్రయత్నం చేశారు. కూటమిలో కాంగ్రెస్‌ను బలహీనపర్చడం కోసం ప్రధాని నానా తంటాలు పడ్డారు. కూటమిలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మిత్ర పక్షాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. మోడీ 9 ఏళ్లలో తాను చేపట్టిన పథకాల గురించి చెప్పారు తప్ప.. కరోనా, నిరుద్యోగం, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, మాల్ న్యూట్రిషన్, దేశం అప్పులు, ప్రకృతి వైపరీత్యాల గురించి ప్రస్తావించలేదు. మణిపూర్ సమస్యను చాలా చిన్నదిగా చేసే ప్రయత్నం చేశారు. దేశంలో మహిళలపై దాడిన అంశంపై కనీసం స్పందించలేదు. అవిశ్వాస తీర్మానంపై మాట్లాడుతూ తనదైన శైలి అయిన ఇండియా-పాక్, తుక్డే తుక్డే గ్యాంగ్ అంటూ ప్రస్తావించారు. ఇండియా కూటమిని పాక్ ప్రేరేపిత కూటమిగా ప్రధాని అభివర్ణించారు.
ఇండియా కూటమి నేతలను దేశ ద్రోహులుగా ప్రధాని చిత్రీకరించారు. అయితే గతంలో కంటే సభలో మోడీ హావబావాల్లో మార్పు కనిపించింది. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతో మాటల్లో పదును తగ్గినట్లు అనిపిస్తోంది. మణిపూర్ ఇష్యూపై నామమాత్రంగానే మోడీ ప్రసంగించారు. మణిపూర్ సమస్యకు ప్రధాని సరైన పరిష్కారం చూపలేదు. ఇక ప్రజల్లోకి వెళ్లేందుకు విపక్షాలకు మంచి అవకాశం లభించినట్లైంది. ముందుగానే విపక్షాలు సభనుంచి వ్యూహాత్మకంగా వాకౌట్ చేశాయి. మోడీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు విపక్షాలు కొంత వరకూ సక్సెక్ అయ్యాయి.