REVANTH REDDY: సీఎంగా రేవంత్.. ప్రధాని మోదీ ట్వీట్.. ఏమన్నారంటే..

రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశమూ అభివృద్ధి చెందినట్లే. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకరించుకోవాలి. అది కూడా రాజకీయాలు, విబేధాల్ని పక్కనబెట్టి పని చేసుకోవాలి. ఈ విషయంలో తెలంగాణకు సంబంధించి గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్‌కు, ప్రధాని మోదీకి మధ్య విబేధాలున్నాయి.

  • Written By:
  • Publish Date - December 7, 2023 / 05:17 PM IST

REVANTH REDDY: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి, పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రేవంత్‌ను ఉద్దేశించి గురువారం ట్వీట్ చేశారు. “తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ రేవంత్ రెడ్డికి అభినందనలు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇస్తున్నాను” అని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మోదీ తెలుగులో ట్వీట్ చేయడం విశేషం. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర సహకారం తప్పనిసరి.

REVANTH REDDY: కేసీఆర్‌తో ప్రమాదమేనా? కాంగ్రెస్ సర్కార్ ఐదేళ్లు పాలించగలదా..?

రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశమూ అభివృద్ధి చెందినట్లే. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకరించుకోవాలి. అది కూడా రాజకీయాలు, విబేధాల్ని పక్కనబెట్టి పని చేసుకోవాలి. ఈ విషయంలో తెలంగాణకు సంబంధించి గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్‌కు, ప్రధాని మోదీకి మధ్య విబేధాలున్నాయి. వ్యక్తిగతంగాకన్నా.. పార్టీల పరంగానే ఈ బేధాలున్నాయి. నిజానికి మోదీకి దూరంగా కేసీఆర్ మెలుగుతూ వచ్చారు. పలుసార్లు మోదీ నుంచి సమావేశాలు, సభలకు ఆహ్వానం అందినప్పటికీ కేసీఆర్ హాజరుకాలేదు. ఈ విషయంలో కేసీఆర్ వైపునుంచే దూరం పెరిగిందని చెప్పాలి. ప్రధాని మోదీ నుంచి వచ్చిన ఆహ్వానాల్ని కూడా కేసీఆర్ పట్టించుకోలేదు. అయితే, ఇప్పుడు కూడా తెలంగాణలో బీజేపీ వ్యతిరేక ప్రభుత్వమే ఏర్పడింది.

మరి ఇకపైన అయినా.. రెండు ప్రభుత్వాలు రాష్ట్రం కోసం కలిసి పనిచేస్తాయా.. లేదా.. అన్నది చూడాలి. ఈ విషయంలో రేవంత్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు అనేదానిపై ఈ అంశం ఆధారపడి ఉంటుంది.