Chandrababu Naidu: చంద్రబాబుపై ఏ1గా కేసు నమోదు..!

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటూ మరో 19 మందిపై కేసు నమోదు అయింది. ఇటీవల టీడీపీ అధినేత అనేక ఊళ్లు పర్యటిస్తున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునే ముసుగులో స్థానిక టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులకు వైసీపీ కార్యకర్త చాంద్ బాషా ఫిర్యాదు చేశాడు.

  • Written By:
  • Updated On - August 9, 2023 / 04:35 PM IST

అన్నమయ్య జిల్లా ముదివేడు మండలంలోని అంగల్లు గ్రామంలో ఇటీవల చంద్రబాబు నాయుడు పర్యటించారు. ప్రాజెక్టు సందర్శించేందుకు వచ్చి అక్కడి స్థానిక టీడీపీ కార్యకర్తలను, పార్టీ శ్రేణులను రెచ్చగొట్టేలా ప్రసంగిస్తున్నారని కురబలకోట మండలం, దాదంవారిపల్లి చెందిన బి.ఆర్ ఉమాపతి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన తంబళ్లపల్లె నియోజకవర్గం ముదివేడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ఏ1 గా నారా చంద్రబాబు నాయుడిని చేర్చగా, ఏ2 మాజీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ ఉన్నారు. వీరితో పాటూ మరో 18 మందిని ఎక్యూస్డ్ గా పేర్కొన్నారు. క్రైమ్ నెంబర్ 79 /2023 120బి 147 145 153 307 115 109 323 324 506 రెడ్ విత్149 ఐపీసీ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ముదివేడు ఎస్సై షేక్ మొబిన్ తాజ్ తెలిపారు.

ఎఫ్ఐఆర్ లో నమోదైన పేర్ల వివరాలు

  • ఏ3. అమర్నాథ్ రెడ్డి,
  • ఏ4 ,రాంభూపాల్ రెడ్డి ,
  • ఏ5,షాజహాన్ భాష ,
  • ఏ6,దొమ్మలపాటి రమేష్,
  • ఏ7,కిషోర్ కుమార్ రెడ్డి ,
  • ఏ8,ఘంటా నరహరి ,
  • ఏ9,శ్రీరామ్ చినబాబు,
  • ఏ10,శ్రీధర్ వర్మ ,
  • ఏ11,ఆర్ శ్రీనివాసరెడ్డి ,
  • ఏ12,పులివర్తి నాని,
  • ఏ13, ఎం రాంప్రసాద్ రెడ్డి,
  • ఏ14,పలన్ ఖాదర్ ఖాన్,
  • ఏ15, వై జి రమణ,
  • ఏ16, వై జి సురేంద్ర ,
  • ఏ17,రాచకొండ మధుబాబు ,
  • ఏ18,పర్వీన్ తాజ్,
  • ఏ19, ఏలగిరి దొరస్వామి నాయుడు,
  • ఏ20, నారాయణస్వామి రెడ్డి ,తో పాటు మరి కొందరిని విచారిస్తున్నారు.

T.V.SRIKAR