Ponguleti: పొంగులేటి కొత్త పార్టీ పెట్టబోతున్నారా ?

సొంత పార్టీ ద్వారా ఎంతో కొంత ప్రభావం చూపించి కొన్ని సీట్లు గెలుచుకుంటే.. తాను అనుకున్న రాజకీయ లక్ష్యం సాధించవచ్చనే ఆలోచనతో పొంగులేటి ఉన్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.

  • Written By:
  • Publish Date - March 3, 2023 / 04:52 PM IST

తెలంగాణ రాజకీయాలు కాక మీద కనిపిస్తున్నాయ్. ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాత.. బీజేపీ నేతలు గేర్ మార్చేందుకు సిద్ధం అవుతున్నారు. దీంతో పాలిటిక్స్ మరింత ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తున్నాయ్. బలం పెంచుకోవడం, వలసను ప్రోత్సహించడం మీదే బీజేపీ దృష్టి పెట్టబోతున్నారు.

ఐతే కమలం పార్టీ అడుగులు పడుతున్న ప్రతీసారి కనిపిస్తున్న ఆలోచన.. పొంగులేటి ! బీజేపీలో చేరడం దాదాపు ఖాయం అయిందన్న హడావుడి జరిగింది ఆ మధ్య ! ఐతే ఆ తర్వాత అంతా కూల్ అయింది. ఇలాంటి సమయంలో పొంగులేటికి సంబంధించి ఓ కీలక విషయంలో రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు కారణం అవుతోంది. నిజానికి బీజేపీ, కాంగ్రెస్, వైటీపీలతో చర్చలు జరిపిన పొంగులేటి.. ఇప్పుడో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ రాజకీయవర్గాల్లో చక్కర్లు కొడుతోంది. సొంత పార్టీ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. పేరు పలకడానికి పొంగులేటి ఒక్కరే అయినా.. ఆయన ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం ఉంటుంది. ఉమ్మడి వరంగల్, నల్గొండలోనూ ఆయన ప్రభావం కనిపిస్తుంది. దీంతో తనే సొంతంగా పార్టీ పెట్టాలనే ఆలోచనలో పొంగులేటి ఉన్నారని తెలుస్తోంది.

మరో పార్టీలో చేరి తన రాజకీయ బలాన్ని వారికి సీట్లుగా ఇవ్వడానికి బదులు.. తానే సొంత పార్టీ ఏర్పాటు చేసి ముందుకు సాగితే ఎలా ఉంటుందనే దానిపై ఆయన తన అనుచరులు, సన్నిహితులతో సమాలోచనలు జరుపుతున్నారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీల మధ్య రాజకీయ పోరు హోరాహోరీగా సాగనుంది. దీంతో సొంత పార్టీ ద్వారా ఎంతో కొంత ప్రభావం చూపించి కొన్ని సీట్లు గెలుచుకుంటే.. తాను అనుకున్న రాజకీయ లక్ష్యం సాధించవచ్చనే ఆలోచనతో పొంగులేటి ఉన్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.