ట్రంప్ నన్ను కాపాడు: ప్రభాకర్ రావు రిక్వస్ట్

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ శరణార్థి గా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు విజ్ఞప్తి చేసారు.

  • Written By:
  • Publish Date - November 29, 2024 / 01:21 PM IST

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ శరణార్థి గా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు విజ్ఞప్తి చేసారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందంటూ పిటిషన్ వేసారు. తెలంగాణ ప్రభుత్వంలో కీలక స్థానంలో తాను పనిచేశానని పేర్కొన్న ప్రభాకర్ రావు… రాజకీయంగా తనను ప్రభుత్వం వేధిస్తుందని పిటిషన్ లో పేర్కొన్నారు.

తీవ్ర అనారోగ్య సమస్యలతో తాను కొట్టుమిట్టాడుతున్నానని ప్రభాకర్ రావు అమెరికా ప్రభుత్వానికి తెలియజేసారు. ప్రస్తుతానికి ఫ్లోరిడాలో తన కుమారుని వద్ద ఉంటున్నానని ప్రభాకర్ రావు పేర్కొన్నారు. మరో వైపు అమెరికాలో తలదాచుకుంటున్న ప్రభాకర్ రావు ని ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించేందుకు పోలీసుల ప్రయత్నాలు ముమ్మరం చేసారు. ఇప్పటికే చికాగో కు చేరుకున్న ఛానల్ ఎండి శ్రవణ్ రావు కూడా అమెరికాలోనే ఉంటున్నాడు. ప్రస్తుతానికి చికాగోలో శ్రవణ్ రావు అడ్రస్ ను కనుగొన్న పోలీసులు… అమెరికా ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు.