C P Radhakrishnan: తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్.. ఝార్ఖండ్ గవర్నర్‌కు అదనపు బాధ్యతలు

తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై సోమవారం.. రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమోదం తెలిపారు. దీంతో కేంద్రం సీపీ.రాధాకృష్ణన్‌‌ను తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.

  • Written By:
  • Publish Date - March 19, 2024 / 01:40 PM IST

C P Radhakrishnan: తెలంగాణ గవర్నర్‌గా సీపీ.రాధాకృష్ణన్‌‌ను నియమించింది కేంద్రం. ఝార్ఖండ్‌ గవర్నర్‌‌గా కొనసాగుతున్న రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆయనకు తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్ట్‌‌నెంట్‌ గవర్నర్‌ బాధ్యతలను కూడా అప్పగించారు. తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై సోమవారం.. రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమోదం తెలిపారు.

BIRYANI ORDERS : ఏంటీ ! బిర్యానీలే తింటున్నారా..?

దీంతో కేంద్రం సీపీ.రాధాకృష్ణన్‌‌ను తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. రాబోయే తమిళనాడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంతోనే తమిళసై గవర్నర్ పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. తమిళిసై చెన్నై సెంట్రల్‌, కన్యాకుమారి, తుత్తుకూడి పార్లమెంటు స్థానాల్లోని ఏదొ ఒక నియోజక వర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేసే అవకాశం ఉంది. బీజేపీ అధిష్టానం సూచనమేరకే తమిళిసై గవర్నర్ పదవికి రాజీనామా చేసి, ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. 2019లో తెలంగాణ రెండో గవర్నర్‌గా తమిళి సై నియమితులయ్యారు. దాదాపు నాలుగున్నరేళ్లకుగా పైగా ఆమె తెలంగాణ గవర్నర్‌గా కొనసాగారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య తీవ్ర విబేధాలు తలెత్తాయి. అనేక అంశాల్లో పరస్పరం విమర్శలు చేసుకున్నారు.

గవర్నర్‌కు ఒక రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం సహాయనిరాకరణ చేసింది. మరోవైపు.. గవర్నర్‌ పదవికి తమిళ సై రాజీనామా చేయడంపై తమిళనాడు నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు. ఉప రాష్ట్రపతి పదవి కోసమే ఆమె గవర్నర్ పదవిని వదులుకున్నారని అక్కడి నేతలు ఆరోపిస్తున్నారు. మరి ప్రచారం జరుగుతున్నట్లుగా తమిళిసై పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారా.. లేదా.. అనేది తెలియాలి.