పూనమ్ కౌర్ సోషల్ మీడియా యాక్టివిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేు. వివాదాస్పద కంటెంట్‌తో ఎప్పుడూ హాట్‌టాపిక్‌గా ఉంటుందీ బ్యూటీ. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో రియాక్ట్ అయిన ప్రతీసారి.. ఓ కొత్త రచ్చ స్టార్ట్ అవుతూనే ఉంటుంది. ఇండస్ట్రీలో ఇద్దరు వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ.. అప్పట్లో పూనమ్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె రాతలపై, మాటలపై.. పెద్ద రచ్చే జరిగింది ఆ మధ్య. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ మీద పరోక్షంగా ఎప్పుడూ ట్వీట్లు చేస్తూ.. సరికొత్త వివాదానికి ఆజ్యం పోస్తుంటుంది.
వీళ్ల మద్య ఏం జరిగిందో క్లారిటీ లేకపోయినా.. చాన్స్ దొరికినుప్పుడల్లా ఆ ఇద్దరిపై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతుంటుంది పూనమ్. మహిళల ఇష్యూ ఎలాంటిదైనా.. వెంటనే సోషల్ మీడియాకు వచ్చేస్తుంటుంది పూనమ్. ఇప్పుడు సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సెక్స్ వీడియోలు రచ్చ రేపుతున్న వేళ… తన స్టైల్లో రియాక్ట్ అయింది. ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సత్యవేడులో బాధిత మహిళపై కాకుండా.. ఆమె భర్తను టార్గెట్ చేస్తూ పూనమ్ ట్వీట్ చేసింది. పవర్ రేపిస్ట్‌ని బయటపెట్టమని… తన భాగస్వామిని ప్రోత్సహించిన భర్తను అభినందిస్తున్నానంటూ పూనమ్ ట్వీట్ చేసింది.
అతను అలా తన భార్యకు అండగా లేకుండా ఉండుంటే… ఇప్పుడు ఆ ఎమ్మెల్యే టీడీపీ నుంచి సస్పెండ్ అయ్యేవాడు కాదని రాసుకొచ్చింది. ఇలాంటి సంఘటన ఎదురైతే… అధికారంలో ఉన్నవారితో గొడవ ఎందుకని చాలామంది మౌనంగా ఉండమని చెప్తారని.. ఐతే అతను తన భార్యను సపోర్ట్ చేస్తూ తప్పును బహిర్గతం చేశాడని.. తన భార్య మీద అత్యాచారం చేసిన ఎమ్మెల్యే వ్యవహారాన్ని బట్టబయలు చేసేలా ఎంకరేజ్ చేసిన భర్తకు కృతజ్ఞతలు అంటూ భారీగా లైన్స్ రాసుకొచ్చింది. అత్యాచారానికి గురైన మహిళ దైర్యంగా బయటికొచ్చి మాట్లాడడంపై ప్రశంసలు గుప్పించారు. ఇదంతా బాగానే ఉంది కానీ.. పవర్ రేపిస్ట్ అంటూ పూనమ్ పదం వాడడమే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త సంచలనంగా మారింది. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని టార్గెట్ చేసుకునే.. పూనమ్ ఇలాంటి పదం వాడిందా.. లేదంటే పరోక్షంగా కౌంటర్ ఇచ్చిందా అనే చర్చ జరుగుతోంది.