బిగ్ బ్రేకింగ్; రాజ్యసభలో జగన్ కు షాక్

అధికారం కోల్పోయిన వైసీపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ఇలా దాదాపుగా అందరూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు.

  • Written By:
  • Updated On - September 24, 2024 / 06:54 PM IST

అధికారం కోల్పోయిన వైసీపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ఇలా దాదాపుగా ఒక్కొక్కరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. తాజాగా రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసేసారు. కృష్ణయ్య రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు.

వైసీపీ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు కృష్ణయ్య. మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన్ రావు తర్వాత వైసీపీకి గుడ్ బై చెప్పారు. గత కొన్ని రోజులుగా ఆయన రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్నాయి. బీసీ నేతగా తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన కృష్ణయ్య… 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి తెలంగాణాలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక కృష్ణయ్య రాజీనామాతో రాజ్యసభలో వైసీపీ బలం 8కి పడిపోయింది.

కృష్ణయ్య రాజీనామాతో ఖాళీ ఏర్పడినట్టు పార్లమెంటరీ బులెటిన్ విడుదల అయింది. బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకే రాజీనామా చేసినట్టు కృష్ణయ్య ప్రకటించారు. నిన్న 100 బీసీ కుల సంఘాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నా అని తెలిపిన ఆయన… నేడు ఉదయమే రాజీనామా చేసినా వార్త మాత్రం సాయంత్రం బయటకు వచ్చింది.