Raghu Rama Krishna Raju: ఉండిలో రఘురామకు షాక్ తప్పదా.. RRR ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నాడా..?

నరసాపురం పార్లమెంటు సభ్యుడిగా ఉన్న రఘురామ.. వైసీపీకి ఎదురు తిరిగి ఆ తర్వాత బీజేపీలో చేరాలనుకున్నారు. కమలం పార్టీ ఇచ్చిన ఝలక్‌తో ఫైనల్‌గా టీడీపీలో చేరారు. తనకు పార్టీలు పిలిచి సీటు ఇస్తాయని కలలు కన్న రఘురామకు బీజేపీ షాకిచ్చింది.

  • Written By:
  • Publish Date - April 27, 2024 / 08:33 PM IST

Raghu Rama Krishna Raju: ఉండి అసెంబ్లీ గురించి.. ఈ ఎన్నికల్లో జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. చాలా ట్విస్టుల తర్వాత.. ఆ స్థానం రఘురామకు కన్ఫార్మ్ అయింది. టీడీపీ నుంచి ఆయన బరిలో నిలుస్తున్నారు. నరసాపురం పార్లమెంటు సభ్యుడిగా ఉన్న రఘురామ.. వైసీపీకి ఎదురు తిరిగి ఆ తర్వాత బీజేపీలో చేరాలనుకున్నారు. కమలం పార్టీ ఇచ్చిన ఝలక్‌తో ఫైనల్‌గా టీడీపీలో చేరారు. తనకు పార్టీలు పిలిచి సీటు ఇస్తాయని కలలు కన్న రఘురామకు బీజేపీ షాకిచ్చింది.

YS JAGAN MANIFESTO: కూటమి పథకాలకు లక్షన్నర కోట్లు.. బాబూ.. ఆ నిధులెలా వస్తాయ్

నరసాపురం పార్లమెంటు టిక్కెట్ ఇవ్వలేదు. కారణం ఏదైనా.. ట్రిపుల్ఆర్‌ను బీజేపీ దూరం పెట్టింది. తనకు టిక్కెట్ రాకపోవడానికి వైసీపీయే కారణమంటూ రఘురామ ఆ మధ్య చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. కట్ చేస్తే.. తెరవెనక జరిగింది ఏదైనా సరే.. చివరకు రఘురామ కోరిక ఫలించింది. చంద్రబాబు ఎంత ప్రయత్నించినా నరసాపురం టీడీపీకి ఇవ్వడానికి బీజేపీ అంగీకరించపోవడంతో.. చివరకు ఉండి అసెంబ్లీ టిక్కెట్ రఘురామకు ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును పిలిచి.. చంద్రబాబు బుజ్జగించారు. ఆయన కూడా కూల్ అయ్యారు. అంతా బాగుంది అనుకుంటున్న టైమ్‌లో.. రఘురామకు ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు.. ఎన్నికల బరిలో ఉన్నారు. ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఐతే ఇప్పుడు రఘురామకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. శివరామ పోటీలో ఉంటే ఎంత నష్టమో కానీ.. ఆయన పోటీలో ఉండడంపై రఘురామ నోరు పారేసుకోవడం మాత్రం ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుదోంది.

శివరామను ఏదోలా బుజ్జగించి.. తనకు మద్దతు ఇచ్చేలా చేసుకోవాల్సింది పోయి.. ఆయన మీద ఎటాకింగ్‌కు దిగడం రఘురామకు ఇబ్బందిగా మార అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. వైసీపీ నుంచి శివరామరాజు ప్యాకేజీ తీసుకుని తనను ఓడించడానికి పోటీలో ఉన్నారంటూ.. రఘురామ చేసిన వ్యాఖ్యలు క్షత్రియ ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. శివరామ రాజు ఎఫెక్ట్ రఘురామ మీద పడడం ఖాయం అని.. టీడీపీ ఓటమి ఖాయం అంటూ.. కొత్త చర్చ కూడా మొదలుపెట్టేశారు కొందరు.